ప‌వ‌న్ కోసం క్రిష్ క‌స‌ర‌త్తులు

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌న్న కోరిక ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. స్టార్ హీరోతో సినిమా చేయ‌డంలో ఉన్న సౌల‌భ్యాలే వేరు. అందుకే ప‌వ‌న్‌లాంటి హీరోల క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు రాస్తుంటారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా అదే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. గ‌మ్యం, వేదం, కృష్ణంవందే జ‌గద్గురుమ్‌, గౌత‌మిపుత్ర‌…. ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓమార్క్ సృష్టించుకొన్నాడు క్రిష్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో మ‌ణిక‌ర్ణిక రూపొందిస్తున్నాడు. ఆ త‌ర‌వాత తెలుగులో చేయ‌బోయే సినిమా కోసం ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేసేసుకొంటున్నాడు. అందులో భాగంగా ప‌వ‌న్ కోసం ఓ క‌థ రాసుకొనే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్‌. కంచె కంటే ముందు… ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి శ‌త‌విధాల ప్ర‌య‌త్నించాడు క్రిష్‌.కానీ అది కార్య‌రూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ప‌వ‌న్‌ని త‌న క‌థ‌తో మెప్పించాల్సిందేన‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌హేష్ బాబు కోసం త్ర‌యం అనే క‌థ సిద్దంచేశాడు క్రిష్. కానీ దాన్నిప‌ట్టాలెక్కించ‌డంలో విఫ‌లం అయ్యాడు. బ‌డా హీరోల‌తో ప‌నిచేసే అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయాయి. అయితే గౌత‌మి పుత్ర‌తో స్టార్ హీరోల్నీ హ్యాండిల్ చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకొన్నాడు. అందుకే ఈసారి ప‌వ‌న్‌తో క్రిష్ కాంబో సెట్ట‌య్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్న‌ట్టే అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` అలాంటి క‌న్‌ఫ్యూజ్...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

HOT NEWS

[X] Close
[X] Close