అసలు మాఫియా ఎలాంటిదో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కాం వెలుగులోకి తెస్తోంది. అరెస్టు అయిన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గతంలో గ్యాంగ్ స్టర్లు అబూసలీం, మోనికాబేడీలకు తప్పుడు పేర్లతో పాస్ పోర్టు ఇప్పించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ఈ గ్యాంగ్ స్టర్ లవర్స్ ఇద్దర్నీ గతంలో బలగాలు పట్టుకున్నప్పుడు వారి వద్ద పాస్ పోర్టులు లభించాయి. ఆ ఫేక్ పాస్ పోర్టుల్లో అడ్రస్ కర్నూలు జిల్లా ఉంది. అక్కడ్నుంచి తీగలాగితే.. వారికి పాస్ పోర్టులు ఎలా బయటకు వచ్చాయో బయటపడింది.
కృష్ణమోహన్ రెడ్డి చాలా మమంది అనుకుంటున్నట్లుగా ఐఏఎస్ కాదు. ఆయన ఎమ్మార్వో మాత్రమే. కర్నూలుజిల్లాలో ఎమ్మార్వోగా పని చేస్తున్నప్పుడు అబూ సలీం, మోనికా బేడీలకు వేరే పేర్లతో పాస్ పోర్టులు రావడంలో కీలక పాత్ర పోషించారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్ పోర్టు వచ్చేలా చేశారు. అంతా ఆయనచేతుల మీదుగానే సాగింది. అదే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది. ఆ పోలీస్ వెరీఫికేషన్ కర్నూలు ఎస్పీకి నేతృత్వంలో సాగింది. ఆ ఎస్పీకి ఎవరయ్యా అంటే.. మన పీఎస్ఆర్ ఆంజనేయలు.
అంటే ఉద్దేశపూర్వకంగా తన అధికారాల్ని దుర్వినియోగం చేసి.. గ్యాంగ్ స్టర్ కు ఫేక్ పాస్ పోర్టు ఇప్పించి దేశం నుంచి పారిపోయేలా సహకరించారు. వీరికి నేరుగా అబూసలేంతో సంబంధాలు ఉన్నాయా.. మోనికా బేడీతో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా మాఫియాలోని కీలక వ్యక్తుల కోసం సాయం చేశారా అన్నది తేలలేదు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉండటం.. జగన్ రెడ్డి హవా కొనసాగుతూడంటంతో ఈ కేసు తేలిపోయింది. దొంగ పాస్ పోర్టులు ఇప్పించిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సాక్షులుగా మార్చారు. బయటపడ్డారు.
కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో దొరికిపోవడంతో పాత విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ మాఫియా లింకులేందో ఇప్పుడు సిట్ అధికారులు వెలుగులోకి తెస్తే చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.