కృష్ణ‌వంశీకి హీరో దొరికాడు

గోవిందుడు అంద‌రివాడేలే.. త‌ర‌వాత మ‌రో సినిమాని మొద‌లెట్ట‌డానికి చాలా టైమ్ తీసుకొన్నాడు కృష్ణ‌వంశీ. మ‌ధ్య‌లో నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమాకి అవ‌కాశం అందిన‌ట్టే అంది చేజారిపోయింది. ఆ డిప్రెష‌న్‌లోంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న కృష్ణ‌వంశీ.. వెంట‌నే త‌న మ‌రుస‌టి సినిమాని ప్లాన్ చేసేప‌నిలో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం త‌న చేతిలో రుద్రాక్ష అనే స్ర్కిప్టు రెడీగా ఉంది. ప్ర‌కాష్‌రాజ్‌, దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే ఓ హీరో కావాలి. అందుకోసం కొన్ని రోజులుగా వేట సాగిస్తున్నాడు కృష్ణ‌వంశీ. ఇప్పుడు త‌న‌కు ఓ హీరో దొరికాడు.

యువ హీరో సందీప్ కిష‌న్ అయితే త‌న క‌థ‌కు యాప్ట్ అని కృష్ణ‌వంశీ భావించాడ‌ట‌. వెంట‌నే సందీప్ కి క‌థ చెప్ప‌డం, ఓకే అనిపించుకోవ‌డం జ‌రిగిపోయాయి. ప్ర‌స్తుతం సందీప్ ఆ ఒక్క అమ్మాయి త‌ప్ప‌… అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. కృష్ణ‌వంశీ సినిమాలో ఓ అగ్ర క‌థానాయిక న‌టించే అవ‌కాశాలున్నాయి. అనుష్క‌, స‌మంత పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. మ‌రి చివ‌రికి ఎవ‌రు ఖాయ‌మ‌వుతారో చూడాలి. పైసాతో నానికి హిట్ రాక‌పోయినా న‌టుడిగా ఫ్రూవ్ చేసుకోవ‌డానికి ఓ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు సందీప్‌కి అలాంటి అనుభ‌వమే ఎదుర‌వుతుందా? లేదంటే కృష్ణ‌వంశీతో హిట్టూ కొట్టేస్తాడా? చూడాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com