కృష్ణ‌వంశీ నుంచి ‘SILK’

ఆడియో రైట్స్ రోజుకో రీతిన మారుతుంటాయి. చిన్న చిన్న రేట్ల‌కే ఆడియో రైట్స్ ని చేజిక్కించుకొని, ఆ పాట‌లు హిట్ట‌యితే, బీభ‌త్సంగా సొమ్ము చేసుకొనే ప‌నిలో ప‌డ్డాయి ఆడియో కంపెనీలు. ఓ సినిమాని కంపెనీకు అమ్మేసిన త‌ర‌వాత‌… బోలెడ‌న్ని కండీష‌న్ల‌కు, గంద‌ర‌గోళాల‌కు త‌లొగ్గాల్సి ఉంటుంది. అవన్నీ భ‌రించ‌లేకే.. సొంత ఆడియో కంపెనీల వైపు నిర్మాత‌లు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణ‌వంశీ
`SILK` పేరుతో ఓ ఆడియో కంపెనీ మొద‌లెట్టారు. `రంగ‌మార్తండ‌` పాట‌లు ఈ కంపెనీ నుంచే విడుద‌ల అవుతాయి. ‘SILK’ అంటే ఎబ్రివేష‌న్ కూడా ఉంది. ఇందులో ‘S’ అంటే సీతారామ‌శాస్త్రి. ‘IL’ అంటే ఇళ‌య‌రాజా. ‘K’ అంటే కృష్ణ‌వంశీ. కృష్ణ‌వంశీకి సీతారామ‌శాస్త్రి అంటే చాలా ఇష్టం. ప్రేమ‌. సిరివెన్నెల సీతారామ‌ శాస్త్రికి ఆయ‌న ద‌త్త‌పుత్రుడు. మ‌రోవైపు ఇళ‌య‌రాజాకి వీరాభిమాని. అలా త‌న‌కు ఇష్ట‌మైన ఇద్ద‌రు వ్య‌క్తుల పేర్ల‌తో, త‌న పేరుని ముడిపెడుతూ ఓ పేరు సృష్టించాడు కృష్ణ‌వంశీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close