కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలానికి శనివారం హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా నది జలాలు చేరుకున్నాయి. బైరెడ్డిపల్లె మండలం నుంచి తోటకనుమ మీదుగా గ్రావిటీ ద్వారా దానమయ్యగారిపల్లి వరకు నీరు ప్రవాహించింది. వి.కోట మండలం కృష్ణపురం వద్ద జలాలు కుప్పం వైపు ప్రవహిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటికి పరమసముద్రం చెరువుకు చేరుకుంటాయి.
ఇప్పటికే కుప్పం సమీపంలోని షాంతిపురం మండలంలోకి కూడా జలాలు ప్రవేశించాయి. జులై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా ఫేస్-1 కార్యక్రమంలో విడుదల చేసిన నీటి ప్రవాహం దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల మేర ప్రవహించి కుప్పం చేరుకుంటున్నాయి. దిగువన ఉన్న చెరువుల్ని నింపుతూ.. కృష్ణా జలాలు తరలి వస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు నెలాఖరున కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనీవా జలాలకు జలహారతి అర్పించనున్నారు. హంద్రీ, నీవాతో కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు తగ్గనున్నాయి.గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్స్ వేసి ట్యాంకర్ల నీటిని కాలువల్లో పోసి.. నీటిని వదిలినట్లుగా స్కిట్ చేశారు. అప్పట్లో పరువు పోయింది. కనీసం పనులు కూడా పూర్తి చేయలేదు. చంద్రబాబు వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. కృష్ణాకు ముందుగానే వరద రావడంతో నీళ్లు కుప్పం వరకూ తీసుకురాగలిగారు.