కృతిశెట్టికి మ‌రో మంచి ఆఫ‌ర్‌!

తొలి సినిమాతోనే ‘ఉప్పెన‌’లా విరుచుకుప‌డింది కృతి శెట్టి. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో త‌న పేరు మార్మోగిపోయింది. ‘బంగార్రాజు’, `శ్యామ్ సింగ‌రాయ్‌` డీసెంట్ సినిమాలుగా నిలిచాయి. అయితే ఆ త‌ర‌వాత ఆమె ట్రాక్ త‌ప్పిపోయింది. ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా ద‌క్కలేదు. అన్నీ డిజాస్ట‌ర్లే. ఇటీవ‌ల వ‌చ్చిన ‘మ‌న‌మే’ కూడా ఆమెను నిరాశ ప‌రిచింది. ఈ సినిమాతో కృతి ఫామ్ లోకి వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. ఈ ఫ్లాపుతో కృతి శెట్టి కెరీర్ గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. కాక‌పోతే… ఇప్పుడు మ‌రో మంచి ఆఫ‌ర్ కృతిని వెదుక్కొంటూ వ‌చ్చింది.

దుల్క‌ర్ సల్మాన్ హీరోగా సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. రానా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కృతిని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. దుల్క‌ర్‌తో జోడీ క‌ట్ట‌డం కృతికి ఇదే తొలిసారి. ఈ అవ‌కాశం గ‌నుక నిజంగానే కృతి ప‌రం అయితే, అది వ‌ర‌మే అనుకోవాలి. ఎందుకంటే… సెల్వ‌రాజ్ త‌న క‌థానాయిక‌ల పాత్ర‌ల్ని అందంగా, అర్థ‌వంతంగా తీర్చిదిద్దుతాడు. అందులోనూ దుల్క‌ర్ పాన్ ఇండియా హీరో. సినిమా హిట్ట‌యితే అన్ని భాష‌ల్లోనూ మంచి పేరు వ‌స్తుంది. ఈ అవ‌కాశం… కృతి నిల‌బెట్టుకొంటే, హిట్ సినిమా పడ‌లేద‌న్న బెంగ తీరిపోతుంది. దుల్క‌ర్ ఇటీవ‌లే ‘క‌ల్కి’లో ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం తాను హీరోగా రూపొందుతున్న ‘ల‌క్కీ భాస్క‌ర్‌’ విడుద‌ల‌కు స‌మాయాత్తం అయ్యింది. ఈ సినిమా త‌ర‌వాతే సెల్వ‌రాజ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close