చైతూతో కృతిశెట్టి మ‌రోసారి!

ఉప్పెన‌తో సూప‌ర్ హిట్ కొట్టేసింది కృతి శెట్టి. తొలి అడుగులోనే అంద‌రికీ న‌చ్చేసింది. ఆ త‌ర‌వాత వెన‌క్కి తిరిగే చూసుకొనే అవ‌కాశ‌మే రాలేదు. ఇప్పుడు యువ హీరోల సినిమా అంటే కృతి పేరే ముందుగా ప‌రిశీలిస్తున్నారు. తాజాగా నాగ చైత‌న్య సినిమా కోసం కృతిని హీరోయిన్ గా తీసుకొనే ఛాన్సుంద‌ని టాక్‌. నాగ‌చైత‌న్య – వెంక‌ట్ ప్ర‌భు కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో క‌థానాయిక‌గా కృతి పేరు ప‌రిశీలిస్తున్నారు. చైతూ – కృతిశెట్టి జంట‌గా న‌టించ‌డం ఇదే తొలిసారి కాదు. ఇది వ‌ర‌కు బంగార్రాజు కోసం ఇద్ద‌రూ జోడీ క‌ట్టారు. ఆ సినిమా హిట్ట‌య్యింది. అందుకే హిట్ సెంటిమెంట్ ని ఈ సినిమాలోనూ కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. `మానాడు`తో త‌న స్టామినా నిరూపించుకొన్నాడు వెంక‌ట్ ప్ర‌భు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. ఆ రీమేక్ కూడా వెంక‌ట్ ప్ర‌భు చేతికే అప్ప‌గిద్దామ‌నుకొన్నారు. అయితే వెంక‌ట్ ప్ర‌భు ఈసారి మ‌రో కొత్త క‌థ‌తో మెస్మ‌రైజ్ చేయాల‌న్న ఉద్దేశంతో… నాగ‌చైత‌న్య కోసం కొత్త క‌థ రాసుకొన్నాడు. ఇది కూడా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే సాగ‌బోతోంద‌ని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

దర్శి ఎమ్మెల్యే చెప్పుకున్నారు.. మిగతా వాళ్లు మనసులో దాచుకుంటున్నారు !

గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close