సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ అయిపోయారు అనిల్ రావిపూడి. ఈయేడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ఓ సూపర్ హిట్ కొట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సైతం ఆయన్నుంచి ఓ సినిమా రాబోతోంది. ఈసారి ఓ క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ లతో ఓ సినిమా చేస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతారు.
మరోవైపు అనిల్ రావిపూడి కథానాయికల వేట మొదలెట్టారు. కల్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టిని ఎంచుకొన్నట్టు టాక్. వెంకీ సరసర ఎవర్ని తీసుకొంటారో చూడాలి. లిస్టులో మాత్రం పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వెంకీ – కీర్తి అయితే కాంబో కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి నటించలేదు. మరి చివరికి ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.
2027 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తారు. సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్. అనిల్ రావిపూడి కూడా అలాంటి కథే సిద్ధం చేస్తున్నాడు. టైటిల్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యిందని, త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.


