మోడీని శత్రువుగా ప్రకటించిన కేటీఆర్, కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ విచారణ హీట్ బీఆర్ఎస్‌లో ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ ఈ స్కాం విషయంలో కేసీఆర్, కేటీఆర్ నోరు విప్పలేదు. తొలి సారిగా కేటీఆర్ .. సోదరి కవితకు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ లో సుదీర్ఘంగా మాట్లాడిన కేటీఆర్.. మోదీపై విరుచుకుపడ్డారు. ఐదు స్కాంల గురించి ప్రశ్నించారు.
ఇప్పటి వరకు డబుల్ ఇంజిన్ అంటే ఏదో అనుకున్నారని.. కానీ ఒక ఇంజిన్ మోదీ అయితే రెండో ఇంజిన్ అదాని అని ఎద్దేవా అని ఆరోపించారు. మోదీ తిరిగి మార్కెటింగ్ చేస్తే అదాని సంపాదిస్తారన్నారు. ఇలా మిత్రుడు ఇచ్చిన సొమ్ముతో ప్రజలు ఎన్నుకున్న పార్టీలను కూల్చే పనిని మోదీ చేస్తున్నారన్నారు.

స్వదేశంలో చౌకగా బొగ్గు దొరుకుతుంటే… విదేశాల్లో బొగ్గును బలవంతంగా కొనిపిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఇది స్కామ్ కాదా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో 42 మంది లిక్కర్ తాగి చస్తే అది స్కామా మోడీ స్కీమా అని నిలదీశారు కేటీఆర్. అదానికి అనుకూలంగా తయారు చేసిన పాలసీలు తయారు చేసిన మీరు చేసింది స్కాం కాదా అని ప్రశ్నించారు. ఆయన బొగ్గు గనుల నుంచి బొగ్గు కొనాలని ఒత్తిడి చేయడం స్కాం కాదా… ముంద్రా పోర్టులో డ్రగ్స్‌ దొరికితే స్కాం కాదా… అని నిలదీశారు. మోడీకి దమ్ముందా అదానీతో ఉన్న సంబంధంపై విచారణకు రెడీనా అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్నాటకలో ఎమ్మెల్యే కుమారుడు విరూపక్ష కుమారుడు డబ్బులు తీసుకుంటూ దొరికినా కేసులు లేవన్నారు.

అయితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయలేదని.. ఆమెకేం సంబంధంలేదని కేటీఆర్ ఎక్కడా చతెప్పలేదు. కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటారని బీజేపీ నేతల్లా కేసులు పెడితే దాక్కోరని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడిన వెంటనే.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కవిత కూడా మోదీపై మండిపడ్డారు. తమను టార్గెట్ చేసుకునే బదులు నిరుద్యోగాన్ని, ధరల పెరుగుదలను టార్గెట్ చేయాలని సూచించారు. ముందు ప్రధాని వెనుక అదానీ ఉన్నారని అందరికీ తెలుసని.. మోదీకి తాను భయపడనని బీజేపీ కుట్రలను ఎదుర్కొంటానని కవిత ధీమా వ్యక్తం చేశారు. మోదీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తెచ్చారన్నారు. మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని… న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం పూర్తిగా రాజకీయమేనని..మోదీ కుట్ర అనే కోణంలోనే బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close