కేటీఆర్ కేబినెట్‌లో బెర్తల కోసం అప్పుడే పోటీనట..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో నెలకొన్న భిన్నమైన పరిస్థితిని ఉపయోగించుకుని డిఫరెంట్ మైండ్ గేమ్‌ను బండి సంజయ్ జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సారి ఆయన అధికార మార్పిడిపై జరుగుతున్న ప్రచారాన్ని దీనికి ఉపయోగించుకున్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం అంతా.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికేనని బండి సంజయ్ అనుమానిస్తున్నారు. అందుకే.. కేటీఆర్‌ను సీఎం చేయడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అంతే కాదు… అధికార మార్పిడి ఖాయమన్నట్లుగా మాట్లాడారు. అంటే… కేసీఆర్ నుంచి బ్యాటన్ కేటీఆర్ అందుకుంటారని అంటున్నారు. ఇలా చేయడంతోనే ఆ పార్టీలో సంక్షోభం వస్తుందని కూడా తేల్చేశారు. ఇప్పటికే.., కేటీఆర్ కేబినెట్‌లో పదవుల కోసం పార్టీలో కొట్లాట జరుగుతోందని.. కేటీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకోకుంటే కొత్త పార్టీ పెట్టే యోచనలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బండి సంజయ్‌ ప్రకటించి కలకలం రేపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీలు పెట్టే సామర్థ్యం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరున్నారబ్బా అన్న చర్చ జరుగుతోంది.

ఇది బీజేపీ మైండ్ గేమ్ మాత్రమేనని.. అసలు కేటీఆర్ సీఎం అన్న చర్చే … పార్టీలో జరగడం లేదని.. టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదన్న భావన కల్పించడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్‌లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని.. ఏదైనా జరగొచ్చన్న చర్చ మాత్రం.. రాజకీయవర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటా చేరిక ఫైల్ జగన్ వద్ద ఉందట..!

గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీలో యాక్టివ్‌గా మారుతున్నారనో.. లేకపోతే.. ఆయన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసినా తర్వాత వైసీపీలో చేరుతారని చెప్పడానికో కానీ విజయసాయిరెడ్డి గంటా మెడలో గంట కట్టారు. గంటా శ్రీనివాసరావు...

రూ. ఏడు కోట్లతో సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది వాహనాలతో కూడిన కాన్వాయ్ కోసం రూ. ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టనున్నారు. ఈ మేరకు...
video

‘వ‌కీల్ సాబ్’ పాట‌: ప‌వ‌న్‌ పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మా?

https://www.youtube.com/watch?v=SBMZA5-pe30 వకీల్ సాబ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా... ఇది వ‌ర‌కు `మ‌గువ మ‌గువ‌` పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. పింక్ సినిమాకి ఇది రీమేక్‌. `పింక్‌` అనేది అమ్మాయి క‌థ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే వాళ్ల కోణంలో,...

స్వరూపానందకు మొక్కులు…! సీపీఐ ఇజ్జత్ తీసేసిన నారాయణ..!

కమ్యూనిస్టులు అంటే కరుడుగట్టిన హేతువాదులు. వారు వాస్తవిక వాదాన్నే నమ్ముతారు. మానవత్వాన్ని.. మంచిని నమ్ముతారు కానీ.. దేవుళ్లను కాదు. ఇలాంటి భావజాలం ఉన్న వారే కమ్యూనిస్టులు అవుతారు. ఆ పార్టీల్లో పై స్థాయికి...

HOT NEWS

[X] Close
[X] Close