తెలంగాణ ప్రతిపక్షాల సవాళ్లకు బీజేపీ దగ్గర ఏదీ ఆన్సర్..!?

తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకు… ఒక్క టీఆర్ఎస్ వైపు నుంచి మాత్రమే కాదు.. టీడీపీ, కాంగ్రెస్ నుంచి కూడా.. ఘాటుగా కౌంటర్లు వచ్చి పడ్డాయి. టీఆర్ఎస్‌ను.. టార్గెట్ చేసుకుని నడ్డా చేసిన విమర్శలు.. ఆ పార్టీ అగ్రనేతలను సహజంగానే ఆగ్రహానికి గురి చేశాయి. సోమవారమే.. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఉండటం..దానికి కేటీఆర్ హాజరు కావడంతో.. బీజేపీకి కౌంటర్ ఘాటుగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే…కేటీఆర్.. నడ్డాపై చెలరేగిపోయారు. జేపీ నడ్డా కాదు…పచ్చి అబద్ధాల అడ్డా అని సెటైర్ వేశారు. తెలంగాణలో కర్ణాటక తరహా రాజకీయాలు నడవవని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రసంస్థలను .. నీతి ఆయోగ్ ఎందుకు ప్రశంసిస్తుందో అడిగి తెలుసుని మాట్లాడాలని.. అడ్డగోలుగా మాట్లాడటానికి నడ్డాకు సిగ్గనిపించటం లేద అని తీవ్రంగా ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి… ఆ చలిమంటల్లో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

బీజేపీ నేత నడ్డా విమర్శించించి టీఆర్ఎస్ ను కాబట్టి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కానీ… అనూహ్యంగా.. కాంగ్రెస్ ,టీడీపీ నేతలు కూడా… జేపీ నడ్డాపై మండిపడ్డారు. అయితే.. వీరి యాంగిల్ వేరు. టీఆర్ఎస్ పై అంత తీవ్రంగా విమర్శలు చేసిన.. జేపీ నడ్డా…. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. తల్చుకుంటే ఏమైనా చేయగలరన్న ఉద్దేశంతో.. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించే దమ్ముందా.. అని టీడీపీ, కాంగ్రెస్ నేతలు సవాళ్లు చేశారు. తెలంగాణలో ఎంతో అవినీతి జరిగిందని… నడ్డా ఆరోపించారు. అలా అయితే.. విచారణ ఎందుకు వేయరని.. టీడీపీ, కాంగ్రెస్ సూటిగానే ప్రశ్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అవినీతిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత సంపత్‌ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడేందుకు .. గతంలో నాగం జనార్ధన్‌రెడ్డికి బీజేపీ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇదే రీతిలో స్పందించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీకి. కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు… టీఆర్ఎస్ పై దూకుడుగా వెళ్తున్నారు కానీ.. అది రాజకీయం కోసమే అన్నట్లుగా ఉండటం.. వారికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా విచారణ జరిపించాలన్న డిమాండ్ ను… ఇతర పార్టీల నేతలు గట్టిగానే వినిపిస్తున్నారు. దీనిపై బీజేపీ నీళ్లు నమలడం తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇతరుల దృష్టిలో బీజేపీ నేతలు.. కేవలం ఆరోపణలు చేస్తున్నారన్న భావన పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ .. బీజేపీ ఆరోపణలను తాను డిఫెండ్ చేసుకుంటోంది.. ఇతర పార్టీలు.. బీజేపీ పై చేస్తున్న ఎటాక్ తో టీఆర్ఎస్‌కు కూడా.. రివర్స్ యాంగిల్ లో అయినా ప్రయోజనమే కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close