తెలంగాణలో టీడీపీ సానుభూతిపరులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్ల ప్రాధాన్యతను కేటీఆర్ గుర్తించారు. గతంలో ఆయన చేసిన దురుసు వ్యాఖ్యలు, ఇతర పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి తాము బ్యాన్ చేసిన ఏబీఎన్ చానల్ కు వెళ్లి ఆర్కే కు ఇంటర్యూ ఇచ్చారు. దీన్ని చాలా మంది ఊహించలేకపోయారు. కేటీఆర్ ను ఆహ్వానించాలని ఆర్కే అయితే అనుకుని ఉండరు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఏబీఎన్,ఆంధ్రజ్యోతి కంప్లీట్ గా బీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాయి. కాంగ్రెస్కు కాస్త ఫేవర్ గా ఉంది.
అందుకే బీఆర్ఎస్ నేతలు ఆంధ్రజ్యోతిని నిషేధించారు. ఆంధ్రజ్యోతి, వెలుగు మీడియాను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. తెలిసి వెళ్లినా రానివ్వడం లేదు., ఇది పూర్తిగా నియంతృత్వమేనని ఆయా మీడియా సంస్థలు ఆరోపిచాయి కానీ తాము చేయాల్సింది తాము చేస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ తనతో డిబేట్ పెట్టాలని ఆర్కేకు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విజ్ఞప్తులను ఈగోకు పోయి కుదరదు అని చెప్పడం ఆర్కే లక్షణం కాదు. వారు అధికారంలో ఉండి ఎలాంటి ఆంక్షలు పెట్టినా… తన మీడియాను ఫేస్ చేయడానికి రెడీ అయినప్పుడు ఆయన ఆహ్వానిస్తారు. కేటీఆర్ ను ఆహ్వానించారు.
రెండు గంటల పాటు జరిగిన చర్చలో కేటీఆర్ ఏపీకి సంబంధించిన అంశాలపైన వివరణ ఇచ్చేందుకు టీడీపీ సానుభూతిపరుల్లో తమపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబుపై ఓటుకు నోటు తీయమన్నా తీయలేదని చెప్పుకొచ్చారు. ఆ కేసు కోర్టుల్లో తేలిపోయింది.. కేసీఆర్ బయటకు తీయడానికి సాధ్యం కాదు. అలాగే రామోజీరావు అరెస్టును కూడా అడ్డుకున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అమరరాజాను తాము లాక్కోలేదని .. వారే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటూంటే… తెలంగాణకే రావొచ్చని ఆహ్వానించానన్నారు. ఇలా.. తమ పార్టీపై ఏపీకి సంబంధిచిన ఓటర్లు… టీడీపీ సానుభూతిపరుల్లో ఉన్న అన్ని సందేహాలను నివృతి చేసే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అరెస్టు పూర్తిగా ఏపీ రాజకీయం అని.. హైదరాబాద్ లో నిరసనలపై తాను అన్న మాటలు పొలైట్ గా చెప్పి ఉండాల్సిందగని చెప్పుకొచ్చారు. కారణం ఏదైనా కేటీఆర్… ఎన్నికలకు ముందు టీడీపీ సానుభూతిపరుల్ని దువ్వేందుకు అడిగి మరీ ఏబీఎన్ చానల్ కువచ్చారు. బ్యాన్ చేసిన టీవీకే ఇంటర్యూ ఇచ్చారు. ఎంత వరకు వర్కవుట్ అవుతుందో మరి !