కేటీఆర్‌ది ఆవేదన – వినేవారికి మీరు చేసిందేటి అనే భావన !

కేటీఆర్ టీవీ9లో కూర్చుని ఓ గంట పాటు తన ఆవేదనను రజనీకాంత్ సాయంతో వెళ్లబోసుకున్నారు. అందులో ప్రజలకు క్షమాపణలు చెప్పడం దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలనుకునే తాను తెలివిగా చేశాననుకునే రాజకీయం వరకూ చాలా కోణాలు ఉన్నాయి. కేటీఆర్ చెప్పిన ప్రతీ మాట ఆయన ఆవేదన.. ఆక్రోశం లాంటిదే అనుకోవచ్చు. కానీ వినేవారికి అలా అనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అలా చేసిందే కదా అన్నది అందరికీ గుర్తుకు వస్తోంది.

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ .. కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో పార్టీ ఉండకూడదన్నట్లుగా బెదిరించి మరీ పార్టీలో చేర్చుకున్న వైనాన్ని ఎవరు మర్చిపోగలరు ?. మర్చిపోయినా కేటీఆర్ ఆవేదన చూడగానే గుర్తుకు వచ్చేస్తుంది. టీవీ9 ఇంటర్యూలో ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ ఆకర్షే గుర్తుకు వస్తుంది. ఇక సోషల్ మీడియా లో పోస్టులు పెడితేకేసులు పెడుతున్నారంటూ ఆయన ఆవేదన చెందారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ . రేవంత్ రెడ్డి .. ఎయిర్ పోర్టులో చంద్రబాబును కలిశారంటూ .. ప్రచారం చేయడం దగ్గర్నుంచి రేవంత్ ఏం మాట్లాడినా ట్విస్ట్ చేయడం వరకూ ఫేక్ క్రియేషన్ లో .. బీఆర్ఎస్ తగ్గడం లేదు. వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ సర్కార్ లో ఫేక్ కాకపోయినా కించ పరిచే పోస్టుల పేరుతో అరెస్టులే కాదు.. కాంగ్రెస్ వార్ రూమ్ పైనే దాడి చేశారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా కేటీఆర్ రేవంత్ నే టార్గెట్ చేస్తున్నారు. కేబినెట్ మంత్రులపైనా ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ పై ఆ ముగ్గురికి కోపం వచ్చేలా చేసి.. చిచ్చుపెట్టేయాలని కేటీఆర్ అదో పెద్ద ప్లాన్ అనుకున్నట్లుగా మాట్లాడారు. కానీ తన హయాంలో జరిగిన ట్యాపింగ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది ఇప్పుడు. ట్యాపింగ్ చేయడం అంత సులువా… లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసింది నిజమేనా అన్న చర్చ ప్రజల్లోకి పోతోంది. నల్లగొండలో ఓ కానిస్టేబుల్ నలభై మంది మహిళల్ని ట్యాపింగ్ సమాచారంతో వేధించినట్లుగా బయటకు తెలియడం సామాన్యుల్లోనూ సంచలనానికి కారణం అవుతోంది.

కేటీఆర్ తమ ప్రభుత్వంలో చేసిన నిర్వాకాలు గుర్తుకు వచ్చేలా .. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆపేస్తే పాత విషయాలు ప్రజలకు గుర్తు రాకుండా ఉంటాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ సానుభూతిపరుల్లోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close