రెబెల్స్ ని వెనక్కి తగ్గించే పనిలో మంత్రి కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో అధికార పార్టీ తెరాసలో ఇప్పుడు రెబెల్స్ బెడద పీక్స్ కి చేరిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరిక లాంటి సలహాల లాంటి సూచనలు ఎన్ని చేసినా… దిగాల్సిన చోట రెబెల్స్ రంగంలోకి చాలామందే దిగారు. నామినేషన్లూ బాగానే వేశారు. అయితే, ఉప సంహరణకు 14వ తేదీ వరకూ గడువు ఉంది. అంటే, ఈ మూడ్రోజుల్లో రెబెల్స్ ని తగ్గించాలి, వీలైతే బుజ్జగించాలి, వినకుంటే వేటు వెయ్యాలి. ఇప్పుడు ఇదే పని కిం కర్తవ్యం అన్నట్టుగా రంగంలోకి దిగారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

ఇవాళ్ల ఉదయం నుంచీ ఆపరేషన్ రెబెల్స్ పనిలోనే ఉన్నారు కేటీఆర్. తెల్లారి నుంచే తెలంగాణ భవన్లో సమీక్ష మొదలుపెట్టారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర్నుంచీ నియోజక వర్గాల వారీగా నివేదికలు తీసుకుంటున్నారు. దీని కోసం కేటీఆర్ ని కలిసేందుకు నాయకులు వరుసగా తెలంగాణ భవన్ కి వస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రెబెల్స్ వివరాలను ఆయనకి వివరిస్తున్నారు. చాలా నియోజక వర్గాల్లో రెబెల్స్ సంఖ్య ఎక్కువగానే ఉందనీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులు చెప్పినా కొంతమంది వినే పరిస్థితిలో లేరనే అంశాన్ని కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆయన స్పందిస్తూ… అలాంటివారితో మరోసారి టచ్ లోకి వెళ్లాలనీ, 14వ తేదీ మధ్యాహ్నానికి ఎక్కడా రెబెల్స్ బరిలో ఉండకూడదని ఆదేశించారని తెలుస్తోంది. ఎంత చెప్పినా నామినేషన్ల ఉప సంహరణకు విననివారి మీద వేటు వెస్తున్నట్టుగా ప్రకటించాలనీ చెప్పినట్టు సమాచారం.

వేటుకి భయపడేవారు తక్కువగా ఉన్నారనీ, ఒకవేళ అలాచేస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా అనే అంశాన్ని కొంతమంది నేతలు కేటీఆర్ ముందు ప్రస్థావించినట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉండదనీ, పార్టీ నుంచి ఒకసారి బహిష్కరణకు గురైతే, భవిష్యత్తులో మళ్లీ తెరాసలోకి వచ్చేందుకు అన్ని తలుపులూ మూసుకుపోతాయనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను మరోసారి గుర్తుచేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మీద అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ వారే ఎక్కువమంది తయారయ్యారు. మున్సిపల్ ఎన్నికలతో మొదలైన ఈ సమస్య తాత్కాలికం అని భావించలేం. పైపెచ్చు, ఈ పరిస్థితిని కాంగ్రెస్, భాజపాలు అందిపుచ్చుకునే వ్యూహంలో రెడీగా ఉన్నాయి. రెబెల్స్ గా బరిలోకి దిగినవారితో నామినేషన్లను ఎలాగోలా నచ్చజెప్పి తీయించగలేరేమోగానీ, అలా వెనక్కి తగ్గించిన నాయకులతో తెరాసకు అనుకూలంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పని చేయంచడం ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనేదే ప్రశ్న? మున్సిపల్ ఫలితాల బాధ్యతలు ఎమ్మెల్యేలు, మంత్రుల భుజాన వేసేసినా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం కూడా కేటీఆర్ కి ఉంటుంది. మరి, రెబెల్స్ ని నూటికి నూరు శాతం మద్దతుదారులుగా మలిచే ప్రయత్నంలో కేటీఆర్ ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తారనేది మున్ముందు చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

HOT NEWS

[X] Close
[X] Close