జూబ్లిహిల్స్ కాకుండానే పది నినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్, కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ ఈ మేరకు కేటీఆర్కు ఆ పది నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్ చేయాలని కేటీఆర్కు సూచించారు. దీంతో కేటీఆర్.. త్వరలో జిల్లాల పర్యటన చేపట్టి ఆ పది నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని డిసైడయ్యారు. మందుగా గద్వాలలో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. దీంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది స్పష్టత లేదు. కానీ ఇప్పటికే తాము పార్టీ మారలేదన్న ప్రకటనలు ఆయా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అంటే వారు స్పీకర్ కు తాము పార్టీ మారలేదన్న సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ మరారు అన్న దానికి చట్టంలో ఉన్న నిర్వచనం ప్రకారం.. బీఆర్ఎస్ సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే అనర్హతా వేటు వేయరు.
అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఉపఎన్నికలు వచ్చేలా న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ అంటున్నారు. ఉపఎన్నికలు వచ్చి తీరుతాయని పార్టీ నేతలకు చెబుతున్నారు. అంత నమ్మకాన్ని చేతల్లో చూపిస్తున్నారు. ఉపఎన్నికలకు ప్రిపరేషన్స్ ప్రారంభిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉపఎన్నికలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.