కేటీఆర్ చెప్పినట్టు… కోర్టు తీర్పు, ప్రజా కోర్టు తీర్పు ఒక‌టేనా..?

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎందుకు ర‌ద్దు చేశారూ అంటే… తెరాస స‌ర్కారు చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతోంది కాబ‌ట్టి..! ఇదే కార‌ణాన్ని ప్ర‌తీ ప్రచార స‌భ‌లోనూ చెప్పుకుంటూ వ‌స్తున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌. మంగ‌ళ‌వారం ఘ‌న్ పూర్ లో జ‌రిగిన స‌భ‌లో కూడా మంత్రి కేటీఆర్ ఇదే అంశం మీద మాట్లాడారు. తెలంగాణ‌లో ప్రాజెక్టులు పూర్త‌యితే కేసీఆర్ కి మ‌ళ్లీ అధికారం వ‌చ్చేస్తుంద‌న్న భ‌యంతోనే ఇలా కేసులు పెట్టి మోకాల‌డ్డే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు.

తెలంగాణ‌కు గ‌డ‌చిన అర‌వ‌య్యేళ్లుగా కాంగ్రెస్‌, టీడీపీలు నీళ్లు ఇవ్వ‌కుండా స‌తాయించాయ‌న్నారు కేటీఆర్‌. ఇవాళ్ల ఆ రెండు పార్టీలూ ఒక‌టై ప్రాజెక్టుల‌కు అడ్డం ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అందుకే ముఖ్య‌మంత్రి ఒక నిర్ణ‌యం తీసుకున్నార‌నీ, ఎన్నిసార్లు కోర్టుల‌కు పోయి వీళ్ల‌తో కొట్లాడ‌తామ‌నీ ఇలా కాదనుకున్నారు అన్నారు. ప్ర‌పంచంలో అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌తదేశ‌మ‌నీ, అలాంటి ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జా కోర్టుకు మించిన కోర్టు లేద‌న్నారు కేటీఆర్. ‘అందుకే.. ఈరోజు మేం చెప్పేది నిజ‌మైతే మ‌మ్మ‌ల్ని గెలిపించ‌మ‌నీ, క‌చ్చితంగా వారి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యే విధంగా తీర్పు ఇవ్వాలని మీ ముందుకు రావ‌డం జ‌రిగింది’ అన్నారు కేటీఆర్‌. ఇది మ‌నం కావాల‌ని తెచ్చిన ఎన్నిక‌ల‌నీ, ప్ర‌జాతీర్పు కోరుతూ మ‌నం పెట్టిన ఎన్నిక‌ల‌నీ, కాంగ్రెస్ చేస్తున్న ద‌గుల్బాజీ రాజ‌కీయాల‌ను ప్ర‌జా కోర్టులోనే ఎండ‌గ‌ట్టాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు పెడితే, అసెంబ్లీ ర‌ద్దు ఎందుకు చేశారనే దానికి ఇప్ప‌టికీ తెరాస ద‌గ్గ‌ర స‌రైన వివ‌ర‌ణ లేదు. అది చాల‌ద‌న్న‌ట్టు… ప్ర‌జా కోర్టుకు మించింది లేదు, ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పే అంతిమం అని కేటీఆర్ అన‌డ‌మూ లాజిక్ కి దూరంగానే ఉంది. ఈ వ్యాఖ్య ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కూ ఆపాదించుకోవ‌చ్చు, త‌ప్పులేదు. కానీ, కోర్టులో ఉన్న కేసులపై కోర్టు ఇచ్చిన తీర్పునూ… ఎన్నిక‌ల ద్వారా తెరాస‌కు అధికారం క‌ట్ట‌బెడుతూ ఇచ్చిన తీర్పునూ ఒకేలా చూడాల‌న్న‌ట్టు కేసీఆర్ వ్యాఖ్య‌ల సారాంశం ఉంది. అదెలా సాధ్య‌మ‌నేదే ప్ర‌శ్న‌..? కోర్టు, కేసులు, తీర్పు.. అనేది ఎన్నిక‌ల‌తో ఏమాత్రం సంబంధం లేని అంశం. ప్రభుత్వాలు మారుతున్నా కోర్టు పని కోర్టుదే. అంటే, మ‌రోసారి తెరాస గెలిచినంత మాత్రాన దాన్ని కాంగ్రెస్ పెట్టిన కేసులపై తీర్పుగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలా..? ఏమో, కేటీఆర్ వాదన ఇలానే వినిపిస్తోంది. తెరాస స‌ర్కారుపై కాంగ్రెస్ కేసులు వేసింది కాబ‌ట్టి… ప్ర‌జలు ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వాలంటే… ఈ పిలుపులో లాజిక్ ఎక్క‌డుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close