ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
ఏసీబీ నోటీసులు అందినట్లు పేర్కొన్న కేటీఆర్..తాను ఈ నెల 28న విచారణకు హాజరు కాలేనంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా యూకే, అమెరికాలో పర్యటించాల్సి ఉండటంతో ఆ తర్వాత హాజరు అవుతానని ఏసీబీకి సమాధానం ఇచ్చారు.
కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.అయితే, విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక విచారణకు హాజరు అవుతానని కేటీఆర్ రిప్లైకి ఏసీబీ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.