జూబ్లిహిల్స్‌కు జరగబోయే ఉపఎన్నికలో టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రామమోహన్ రెడ్డి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై తాము పోరాడుతూంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్.. లోకేష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో నిజం ఉందో లేదో కానీ కేటీఆర్ టీడీపీ మద్దతు కోసం లోకేష్‌ను సంప్రదించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎందుకంటే కేటీఆర్ మద్దతు కావాలనుకుంటే.. వైసీపీ మద్దతు కోరుతారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని అన్నగా చూస్తారు. వైసీపీ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తారు కానీ.. టీడీపీ మద్దతు కోసం ప్రయత్నించడం తక్కువ. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు అన్న మాటలు, తర్వాత జగన్ గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ టీడీపీ అగ్రనేతలకు తెలియకుండా ఉండవు కాబట్టి.. కేటీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చని భావిస్తున్నారు.
మాగంటి గోపీనాథ్ .. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.కానీ ఆయన రాజకీయ జీవితం అంతా టీడీపీనే. ఆయన పై.. ఆయన కుటుంబంపై చంద్రబాబుకు సానుభూతి ఉంటుంది. ఆ కోణంలో కేటీఆర్ సంప్రదించి ఉండవచ్చని కూడా కొంత మంది అంచనా వేస్తున్నారు.