తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులుకేటీఆర్, సంతోష్ రావులకు లోకల్ కన్నా అంతర్జాతీయ గుర్తింపు ఎక్కువగా లభిస్తోంది. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు లండన్ కేంద్రంగా పనిచేసే డబ్ల్యూ.బి.ఏ వంటి సంస్థ గ్రీన్ ఐకాన్ అవార్డును ప్రకటించింది.
సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం ఒక రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభాస్, సచిన్ టెండూల్కర్, పవన్ కళ్యాణ్ వంటి సెలబ్రిటీలతో మొక్కలు నాటించి ఒక ఉత్సాహాన్ని నింపిన ఆయన, ఇప్పుడు అధికారం లేకపోయినా అదే పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. లండన్ సంస్థ ప్రకటించిన గ్రీన్ ఐకాన్ అవార్డు ఆయన పర్యావరణ స్పృహకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.
మరోవైపు, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అకడమిక్ ,ప్రొఫెషనల్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్శిటీలో ప్రసంగించారు. గతంలో ఆక్స్ఫర్డ్ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి వేదికలపై తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను వివరించారు.
బి.ఆర్.ఎస్ నేతల కృషిని ఇండియాలో, ముఖ్యంగా వారు కృషి చేసిన తెలంగాణలో పెద్దగా గుర్తించడం లేదు. రాజకీయ విభేదాల వల్ల సొంత దేశంలో విమర్శలు ఎదురైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల సంస్థలు కేవలం డేటా, అవుట్‌పుట్ ఆధారంగానే అవార్డులు, ఆహ్వానాలు పంపుతున్నాయి.
