బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడంతో అమెరికా వెళ్ళిన కేటీఆర్ పై అక్కడ కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. డల్లాస్ లో అత్యుత్సాహంతో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా వీసా రద్దయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాక అస్సలు తగ్గడం లేదు. వలస విధానాల్లో దూకుడు కనబరుస్తున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ విదేశీయుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై అమెరికాలోనూ వ్యతిరేకత వస్తున్నా తగ్గడం లేదు ట్రంప్. ఇలాంటి సమయంలో ఆచితూచి మాట్లాడాల్సిన కేటీఆర్ అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేశారు.
ఆ పార్టీ ఎన్నారై ప్రముఖులను ఆనందింపజేయడానికి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే కేటీఆర్ మెడకు చుట్టునేలా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డల్లాస్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ సభలో కేటీఆర్ మాట్లాడుతూ…తెలుగు రాష్ట్రాలు రెండు కాదని, డల్లాస్ పురంతో మూడు అయ్యాయని కామెంట్స్ చేశారు.
అలాగే, డల్లాస్ సమీపంలోని గుంటర్ ప్రాంతాన్ని గుంటూర్ అయిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఈ వ్యాఖ్యలు అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అంటున్నారు. వీటిని అమెరికా సీరియస్ గా తీసుకుంటే కేటీఆర్ పై తప్పకుండా కేసు నమోదు అవుతుందని, వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.