కొత్త చ‌ట్టం పేరుతో నాయ‌కుల్ని బెద‌గొట్టేస్తున్నారు!

కొత్త మున్సిప‌ల్, పంచాయ‌తీరాజ్ చ‌ట్టం… ఇది అత్యంత క‌ఠినంగా ఉండ‌బోతోందంటూ ఈ మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు మంత్రి కేటీఆర్. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా సొంత పార్టీ అభ్య‌ర్థుల‌ను ఉద్దేశించి ఇదే చెప్పారు. కొత్త చ‌ట్టం ప్ర‌కారం ఎవ‌రైనా త‌ప్పులు చేసే క్ష‌మించేది ఉండ‌ద‌న్నారు. ఓ నాలుగు రోజుల కింద‌ట ప్ర‌గ‌తి భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వ‌డాలు త‌గ్గించుకుని స‌రిగా పనిచెయ్య‌క‌పోతే క‌ఠినంగా చ‌ర్య‌లు ఉంటాయంటూ హెచ్చ‌రించారు. మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఇదే త‌ర‌హాలో నాయ‌కులను ఉద్దేశించి సిరిసిల్ల‌లో వ్యాఖ్యానించారు.

కొత్త‌గా వ‌చ్చే మున్సిప‌ల్, పంచాయ‌తీరాజ్ చ‌ట్టం చాలా శ‌క్తివంతంగా ఉంటుంద‌న్నారు కేటీఆర్. ఏ చిన్న త‌ప్పు చేసినా స‌ర్పంచులు, ఎంపీటీల ప‌ద‌వులు ఊడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో మున్సిప‌ల్ కౌన్సిలర్లంటే చాలా చెడ్డ‌పేరుంద‌న్నారు. ఇది పూర్తిగా మారిపోవాల‌నీ, లంచం అనే మాట ఎక్క‌డా వినిపించ‌కూడ‌ద‌న్నారు. కొత్త చ‌ట్టం అమ‌లు ద్వారా నాయ‌కుల జ‌వాబుదారీత‌నం పెరుగుతుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌జ‌ల బాగోగులు కోరుకునే వ్య‌క్తి అనీ, అందుకే స్థానిక సంస్థ‌లపై ఇంత శ్ర‌ద్ధ పెడుతున్నార‌ని కేటీఆర్ మెచ్చుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో అవినీతిని స‌హించే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు.

ప‌దేప‌దే ప‌ద‌వులు ఊడ‌గొడ‌తాం, చ‌ర్య‌లు తీవ్రంగా ఉంటాయంటూ నాయ‌కుల‌కు సొంత పార్టీ అధినాయ‌క‌త్వ‌మే హెచ్చ‌రించ‌డం విడ్డూరంగా ఉంటోంది! ఓర‌కంగా, చ‌ట్టాల పేరుతో నాయ‌కుల్ని ముందు నుంచీ బెద‌ర‌గొట్టేస్తున్నార‌ని అనొచ్చు. కిందిస్థాయి నాయ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇప్ప‌ట్నుంచీ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారేమోగానీ… ఈ క్ర‌మంలో మరో సందేశం కూడా వెళ్తోంది. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు అవినీతిప‌రులు అని ప‌రోక్షంగా చెబుతున్న‌ట్టుగా, అందుకే ఈ స్థాయిలో ఇప్ప‌ట్నుంచీ క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అనే అభిప్రాయ‌మూ క‌లుగుతోంది. ఆ చ‌ట్టం ఎప్పుట్నుంచీ వ‌స్తుందో తెలీదుగానీ, వ‌స్తే ఏం చేస్తారో అనే బెంగ నాయ‌కుల్లో కావాల్సినంత సృష్టిస్తున్నారు. నాయ‌కుల‌కు బాధ్య‌త గుర్తుచేయ‌డానికి ఈ స్థాయిలో భ‌య‌పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close