జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో కలిసి పని చేసేందుకు కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత కుమారస్వామి సుమఖత వ్యక్తం చేశారు . కేసీఆర్ ప్రత్యేక పార్టీ పెట్టి పాజతీయరాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సందర్భంలో కుమారస్వామి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌కు వచ్చే ముందు ఓ హోటల్లో ఆయన బస చేశారు . ఆ హోటల్‌కు మంత్రి కేటీఆర్ వెళ్లి చర్చలు జరిపారు. ఆ తర్వాత అందరూ కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు.
జాతీయ రాజకీయాల విషయంలో తన ఆలోచనలు.. తాను చేపట్టబోతున్న కార్యాచరణ గురించి కేసీఆర్ కుమారస్వామికి వివరించినట్లుగా తెలుస్తోంది. బీజేపీని గద్దె దింపాల్సిన అవసరం ఉందని.. ఎన్డీఏ, యూపీఏ తరహాలో మరో కూటమి అవసరమైన కేసీఆర్ వివరిచాంచారని.. దానికి కుమారస్వామి అంగీకారం తెలిపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా కూటమిలో భాగంగానే ఉంటుందని అందులో జేడీఎస్ కూడా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. శవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు… బీహార్, బెంగాల్, యూపీ, కర్ణాటకల్లో బీజేపీని అడ్డుకుంటే… మోడీ ప్రధాని కావడం సాధ్యం కాదని వివరించినట్లుగా చెబుతున్నారు. దీనికి కుమారస్వామి అంగీకారం తెలిపినట్లుగా చెబుతున్నారు.
దేవేగౌడ వృద్ధాప్యం కారణంగా చురుగ్గా జాతీయ రాజకీయాల్లో లేరు.. జేడీఎస్‌ను కుమారస్వామినే నడుపుతున్నారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. బీజేపీ ఆపరేషన్ కమలంను చేసి పదవి ఊడగొట్టింది. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే దారిలో ఉండటంతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు.