కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై మెల్లగా విచారణలో అన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బైక్ ను బస్సు ఢీకొట్టి.. ఈడ్చుకుని పోయిందని అందుకే స్పార్క్‌లు వచ్చాయని అనుకున్నారు. కానీ మొత్తం దారిలో సీన్ ఫుటేజీలు ఇతర విషయాలు అన్నీ వెలికి తీస్తే.. బస్సు ఢీ కొట్టడానికి ముందే ఆ బైక్ స్కిడ్ అయిపడిపోయి ఉంది. ఆ బైక్ ను వర్షంలో సరిగ్గా చూసుకోక.. వేగంగా బస్సును దానిపైకి ఎక్కించాడు డ్రైవర్. ఫలితంగా మంటలు వచ్చాయి.
బైకర్‌ను శంకర్ గా గుర్తించారు. అతను కూడా సంఘటనాస్థలానికి కాస్త దూరంలో గాయాలతో చనిపోయాడు. అసలు వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఏమిటని పోలీసులు మొత్తం ఆరా తీశారు. అక్కడికి సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు హడావుడి చేశారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నరాు.
వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నారు. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోయింది. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి… స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డారు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వెళ్లిన వీ కావేరి ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంతో భయపడి పారిపోయాడు ఎర్రిస్వామి. సీపీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు.. మొత్తం విషయాలను తెలుసుకున్నారు.
మద్యం మత్తులో వీరిద్దరూ చేసిన నిర్వాకంతోనే పెను ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.