“మెరుగైన” లీజు కోసం “మహా” క్విడ్ ప్రో కో..!

కర్నూలు జిల్లాలో జయజ్యోతి సిమెంట్స్ అనే సంస్థకు ఉన్న ఉన్న లైమ్‌స్టోన్ లీజులను ప్రభుత్వం మరో 30 ఏళ్లకు పొడిగించింది. సాధారణంగా ఇలాంటి పొడిగింపు ప్రక్రియను.. ప్రభుత్వాలు… ఆ లీజు ముగిసిపోయే దశలో ఉంటే చేస్తాయి. ఆ పరిశ్రమ సామర్థ్యం మేరకు.. పని చేసిందా..?.. పని చేస్తోందా..? లేక తవ్వుకుని అమ్ముకుంటుందా..? వంటి అంశాలను బేరీజు వేసుకుని.. లీజును పొడిగిస్తారు. దీనికో ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుంది. అయితే.. జయజ్యోతి సిమెంట్స్‌కు లీజు పొడిగింపు వ్యవహారం మాత్రం గుట్టుముట్టుగా సాగిపోయింది. పోనీ ఆ సంస్థకు ఇప్పుడు ఉన్న లీజు అయిపోతోందా అంటే.. లేదు. ఆ సంస్థకు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 ఏళ్లకు లైమ్‌స్టోన్ గనుల లీజు ఇచ్చింది. ఇంకో పన్నెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడు లీజు గడువు పెంచాల్సిన సమయం.. సందర్భం కూడా లేదు.  కానీ హఠాత్తుగా మరో 30 ఏళ్లకు అంటే.. 2062 వరకూ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు.

“మహా” యజమానులకు 30 ఏళ్ల లీజు నైవేద్యం..!

జయజ్యోతి సిమెంట్స్‌కు 2012లో  లైమ్‌స్టోన్ గనులను లీజుకు ప్రభుత్వం ఇచ్చిన సమయంలో.. యాజమన్యం వేరు. ఇప్పుడు ఉన్న యాజమాన్యం వేరు. 2013లో మహా సిమెంట్స్ యాజమాన్యం.. జయజ్యోతి సిమెంట్స్‌ను రూ. 1400కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటికి సామర్థ్యానికి తగ్గట్లుగా నడవలేకపోతున్న కంపెనీని విలువ కంటే ఎక్కువగా కొనుగోలు చేయడానికి కారణం.. ఆ సంస్థకు ప్రభుత్వం తరపున దక్కిన సున్నపురాయిగనులే.  ఆ గనుల వల్ల కలిగే ప్రయోజనం భారీగా ఉండటంతో.. మహా సిమెంట్స్ యాజమాన్యం..  ఆశ్చర్యపరిచే రీతిలో ఎక్కువ వెచ్చించి… జయజ్యోతి సిమెంట్స్‌ను కొనుగోలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో తమ కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ లైమ్ స్టోన్ లీజు.. మరో పన్నెండేళ్ల పాటు ఉంటుంది.  అయితే.. తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకున్నారో.. లేక.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చక్కదిద్దుకుందామనుకున్నారో కానీ.. లీజును మరో 30 ఏళ్లకు పొడిగించుకోవడంలో సక్సెస్ అయ్యారు.

మిగతా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదేమి…?

అనంతపురం జిల్లా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన త్రిశూల్ ఫ్యాక్టరీకి కేటాయించిన సున్నపురాయి గనులను.. ఆ సంస్థ ఉపయోగించుకోవడం లేదన్న కారణంగా చూపి.. రద్దు చేసేశారు. కానీ ఇలా…సిమెంట్ కంపెనీల పేరుతో లీజులకు తీసుకుని.. సున్నపురాయి అమ్ముకుంటున్న వ్యవహారాలు రాయలసీమ జిల్లాల్లో చాలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో  6 సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటికి ఇచ్చిన సున్నపురాయి గనుల లీజు మాత్రం పొడిగించలేదు. వాటిలో కొన్ని కంపెనీలకు ఇచ్చిన లీజు గడువు ముగిసే సమయం దగ్గరకు వచ్చింది. అయినా ఆయా కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తులపై ఇంకా స్పందన లేదు. ఒక్క మహా సిమెంట్స్‌కు మాత్రమే.. ఈ పొడిగింపు లభించడం.. చర్చనీయాంశమవుతోంది.  

ఏపీలో బాధితుల్నే “టీవీ9” టార్గెట్ చేయడానికి యజమానికి చేసిన మేళ్లే కారణమా..?

మహా సిమెంట్స్ యాజమాన్యం, రివర్స్ టెండర్లలో భాగంగా ఏపీలో పోలవరం సహా కీలక ప్రాజెక్టులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ వ్యాపార భాగస్వాములు. వారు మీడియా రంగంలోకి టీవీ9, 10టీవీ వంటి చానళ్లను కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో ఈ రెండు చానళ్లు… ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై స్పందిస్తున్న తీరు చూసి చాలా మందికి ఆశ్చర్యం వేస్తోంది. బాధితుల పక్షాన ఉండకుండా.. వారినే కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం.. ఐటీ రిపోర్టుల పేరుతో..  ఫేక్ డాక్యుమెంట్లతో తప్పుడు ప్రచారాలు చేయడం కామన్‌గా మారిపోయింది. ఇదంతా..  ఆంధ్రప్రదేశ్‌లో తమ యజమానులకు కలుగుతున్న మేళ్ల మేరకు.. చేస్తున్న సాయమన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close