రివ్యూ: ఖుషి

Kushi Movie Telugu Review

రేటింగ్‌: 3.25/5

విజయ్ దేవరకొండ లైగర్, సమంత శాకుంతలం, శివ నిర్వాణ టక్ జగదీష్ .. ఈ మూడు డిజాస్టర్లే. ఇప్పుడీ ముగ్గురు ‘ఖుషి’ కోసం కలిశారు. టైటిల్ లోనే మాంచి పాజిటివ్ వైబ్ వుంది. పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ ఖుషి టైటిల్ కుదిరింది. పాటలు మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రేమ, మతాంతర వివాహానికి కాశ్మీర్ నేపధ్యం తోడవ్వడం, ప్రచార చిత్రాలతో మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? గత చిత్రాలతో పరాజయంలో వున్న ఈ త్రయానికి ఈ చిత్రం ఖుషి ఇచ్చిందా ?

లెనిన్ స‌త్యం (స‌చిన్ ఖేడ్కర్) నాస్తికుడు. ఈ ప్రపంచం అంతా సైన్స్ చుట్టూనే తిరుగుతుందనేది అతని నమ్మకం. చ‌ద‌రంగం శ్రీ‌నివాస్ (ముర‌ళీ శ‌ర్మ ) ఆస్తికుడు. తను ప్రముఖ ప్రవచనకారుడు. దేవుడు, హోమాలు, జాతకాల మీద ఘాడమైన విశ్వాసం వుంటుంది. లెనిన్ సత్యం కొడుకు విప్లవ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)కి బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం వ‌స్తుంది. తొలి పోస్టింగ్‌ కశ్మీర్ లో. అక్కడ ఆరాధ్య (స‌మంత‌)ని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఆరాధ్య కి కూడా విప్లవ్ పై ప్రేమ పుడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఇంతకీ ఆరాధ్య ఎవరో కాదు.. చ‌ద‌రంగం శ్రీ‌నివాస్ కూతురు. కుటుంబ నేపధ్యాలు పరంగా భిన్న ధ్రువాలైన ఈ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు ? అనేది తక్కిన కథ.

చెప్పే పాయింట్ లో కొత్తదనం వుంటే సినిమా సహజంగానే ఆసక్తిగా మారుతుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ చాలా సున్నితమైన అంశాన్ని ప్రేమకథను జోడించి తను అనుకున్న విషయాన్ని చెప్పడంలో పై చేయి సాధించాడు. లెనిన్ స‌త్యం పాత్రని పరిచయం చేసి ఈ కథ దేని గురించి వుంటుందో ముందే హింట్ ఇచ్చాడు. తర్వాత కశ్మీర్ లో నేపధ్యంలో సాగే ప్రేమకథని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాడు. ఓ కుర్రాడు తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం రొటీన్ వ్యవహారమే. ఐతే ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించిందనేది కీలకం. ఈ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ మంచి ప్రతిభ కనబరిచాడు. బేగం తప్పిపోయిన తన తమ్ముడి కోసం వెదుకుతున్న డ్రామాలో బయటికి కనిపించని ‘నమ్మకం’ అనే పొర వుంటుంది. విప్లవ్ పై ప్రేమ పుట్టడానికి ఆ నమ్మకమే కారణమైయ్యింది. దీంతో ఇది ఒక పరిణితి గల ప్రేమకథ అనిపిస్తుంది. తొలి సగంలో మరీ హిలేరియస్ గా అనిపించిన సన్నివేశాలు లేకపోయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా స్మూత్ గా నడిపారు. కశ్మీర్ నేపధ్యంలో వచ్చే రెండు పాటలు చాలా అందంగా తీర్చిదిద్దారు.

ఎప్పుడైతే బేగం ఆరాధ్య అని తెలిసిందో అక్కడ నుంచి సన్నివేశాలు ఇంటర్వెల్ వరకూ పరుగుపెడతాయి. పెళ్లి చూపులు, పెళ్లి, కుటుంబం నుంచి దూరంగా బ్రతకడం ఇవన్నీ చకచక నడిపారు. ఇంటర్వెల్ బాంగ్ కూడా సింపుల్ గా, సింబాలిక్ గా వేశారు. రెండు భిన్నమైన కుటుంబాలు కావడం వలన ఆరాధ్య సెంటిమెంట్లు కారణంగా సెకండ్ హాఫ్ లో విప్లవ్ కష్టాలు పడతాడేమో అని అర్ధం వచ్చేలా ఇంటర్వెల్ కార్డ్ వేశారు. ఐతే సెకండ్ హాఫ్ అందుకు భిన్నంగా వుంటుంది. పిల్లల కోసం ప్రయత్నించడం, హోమం చేసుకోవాలా వద్దా అనే సంఘర్షణ, రోహిణి, జయరాం సబ్ ప్లాట్ అంతగా రక్తికట్టలేదు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగర్ ట్రాక్, భార్యల గురించి పాడుకునే పాట అంతగా కుదరలేదు. కేరళ ట్రిప్ కొంత ఎమోషన్ ని జోడించింది. ఐతే క్లైమాక్స్ ని బలంగా రాసుకున్నాడు దర్శకుడు. అప్పటివరకూ ఉన్న లోటుపాట్లు క్లైమాక్స్ తో చక్కదిద్ది ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అందించగలిగారు.

విజయ్ పాత్రలో వుండే నటుడు. లైగర్ సినిమా ఫ్లాఫ్ అయినప్పటికీ తన నటనను ఎవరూ వంకపెట్టలేదు. ఇందులో కూడా విప్లవ్ పాత్రలో సహజంగా కనిపించాడు. చాలా సెటిల్డ్ గా చేశాడు. తన ఇమేజ్ కి సరిపడే పాత్ర ఇది. తన లుక్ చాలా బావుంది. కశ్మీర్, అలాగే హైదరాబాద్ మెట్రో రైల్లో.. రెండు ఫైట్లు చేశాడు. ఆ ఫైట్లు లేకపోయినా ఈ కథకి వచ్చిన నష్టం ఏమీ లేదు. సమంత తన అనుభవాన్ని చూపించింది. ఎంటర్వెల్ బ్లాక్ వరకూ మౌనంగా వుండి కేవలం కళ్ళతోనే అభినయించే పాత్ర ఇది. పాటల్లో అందంగా కనిపించింది. ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సమంత నటన చక్కగా కుదిరింది. విజయ్ సమంత ల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వెన్నెల కిషోర్ కశ్మీర్ లో కాసేపు నవ్విస్తాడు. నాస్తికుడు గా సచిన్ ఖేడేకర్, ఆస్తికుడిగా మురళి శర్మ హుందాగా నటించారు. రాహుల్ రామకృష్ణది మరీ అంత ప్రాధాన్యత వున్న పాత్ర కాదు. శరణ్య పాత్ర కూడా బావుంది. శత్రు, రోహిణి, జయరామ్ పాత్రలు పరిధిమేర వున్నాయి.

ప్రేమకథలకు సంగీతం సగం బలం. ఖుషి మ్యూజిక్ కి ఫుల్ మార్కులు పడిపోతాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్ వినసొంపైన పాటలు అందించారు. నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి టైటిల్ ట్రాక్స్ విజువల్ గా కూడా బావున్నాయి. మురళి కెమరాపని తనం నీట్ గా వుంది .విజువల్స్ అన్నీ ఆహ్లాదకరంగా వున్నాయి. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ఫ్ గా వుండాల్సింది. పాటలు మీద పెట్టిన శ్రద్ధ డైలాగులు మీద పెట్టినట్లు కనిపించలేదు. పాత్రలన్నీ మాట్లాడుతూనే వుంటాయి కానీ గుర్తుపెట్టుకునేలా ఏం వుండవు. మైత్రీ మూవీ మేకర్స్ కథ కావాల్సింది సమకూర్చారు. తను అనుకున్న కథని అనవసరమైన హడావిడి లేకుండా నిలకడగా చెప్పడం శివ నిర్వాణ స్టయిల్. వాదాల్ని గెలిపించుకునే క్రమంలో మనుషులం అనే సంగతి మరచిపోతున్నామనే ఓ సున్నితమైన అంశాన్ని చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ విజయం సాధించాడు.

రేటింగ్‌: 3.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close