ఉద్యోగులకు దక్కని ప్రజల సానుభూతి !

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేదన వర్ణనాతీతంగా మారింది. జీతాలు పెంచాలని చేసిన ఉద్యమాలు చివరకు జీతాలు తగ్గించినా ఏమీ చేయలేని స్థితికి చేరాయి. అసలు పీఆర్సీ కోసం నియమించిన అశుతోష్ కమిటీ మిశ్రా నివేదికను పూర్తిగా పక్కన పెట్టేసి అధికారులతో తమకు కావాల్సిన నివేదిక ఇప్పించుకున్న ప్రభుత్వం.. జీతాల్లో కోత వేసేసింది. డీఏలు.. పెండింగ్ లేకుండా అన్నీ చూసుకుంది. హెచ్‌ఆర్ఏ కోత విధించిది. మొత్తంగా చూస్తే జీతం ఏ మాత్రం పెరగకపోగా.. ఒక్కో ఉద్యోగి జీతం నాలుగు, ఐదు వేల వరకూ తగ్గిపోనుంది. జీవనం ఖర్చులు పెరుగుతున్న దశలో ఇలా జీతాలు తగ్గడం ఆశనిపాతమే.

ఉద్యోగులు ఆందోళన చేస్తామని.. అవసరమైతే సమ్మెకు సిద్ధమని చెబుతున్నారు కానీ వారికి సామాన్య ప్రజల నుంచి సపోర్ట్ లభించడం లేదు. ఉద్యోగులకు అలా జరిగి తీరాల్సిందేనన్న అభిప్రాయా‌న్ని ఎక్కువ మంది వినిపిస్తున్నారు. ఉద్యోగులకు సంఘిభావం ప్రకటించడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఉద్యోగ సంఘ నేతలు చేసినఓవరాక్షనే కారణం అని అనుకోవచ్చు. రాజకీయ ప్రకటనలు చేయడంలో చాలా మంది రాటుదేలిపోయారు. ఉద్యోగ సంఘాల నేతలు ఓ పార్టీకి కొమ్ము కాసినట్లుగా వ్యవహరించారు. స్థానిక ఎన్నికల సమయంలో వారి విన్యాసాలు అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి. దీంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మద్దతును వారు పోగొట్టుకున్నారు.

అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం తీరుతో.. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ అనుకూల వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అన్నీ ఆలోచించి జీతాలు తగ్గించింది కాబట్టి వాటితో సరి పెట్టుకోవాలని… ప్రభుత్వ వ్యతిరేకత పెంచే పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. అటు ప్రభుత్వ అనుకూల.. ఇటు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలల్లో సానుభూతిని ఉద్యోగ సంఘాలు కోల్పోయాయి. దీంతో వారి పోరాటానికి బయట నుంచి ఎలాంటి మద్దతూ లభించే అవకాశం కనిపించడం లేదు.

ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం ఎప్పుడో మానేశారు. అలాంటి వారి పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. వారికి అలా జరగాల్సిందేనన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఉద్యోగులు రెంటికి చెడ్డ రేవడి అయ్యారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close