పోటాపోటీగా ఉన్నా ప్రజాకూటమికే ఎడ్జ్ : లగడపాటి

ప్రస్తుతం ఉన్న ప్రజానాడి ప్రకారం.. ప్రజాకూటమి గెలుస్తుందని… ఆంధ్రా అక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ విశ్లేషించారు. ఈ సారి… ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి కాంగ్రెస్‌ ఆధిక్యం చూపిస్తుందన్నారు. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌లో టీఆర్‌ఎస్‌ కు ఆధిక్యం వస్తుందన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా ఎంఐఎం గెలుస్తుందని.. మిగిలిన సీట్లలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పంచుకుంటాయని విశ్లేషించారు. బీజేపీకి ఈ సారి గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించారు. పూర్తి వివరాలు.. ఏడో తేదీన సాయంత్రం ప్రకటిస్తానన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలవబోయే మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. మక్తర్ నుంచి జలంధర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, బెల్లింపల్లి నుంచి జి.వినోద్ ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారని ప్రకటించారు. వీరిలో జలంధర్ రెడ్డి, జి.వినోద్ టీఆర్ఎస్ రెబల్స్. మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ రెబల్. జి.వినోద్, మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ టిక్కెట్ పై… ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జలంధర్ రెడ్డి మాత్రం స్వతంత్రంగా పోటి చేస్తున్నారు. ఈ మూడింటిలో రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో.. సామ రంగారెడ్డి బరిలో ఉన్నారు. బోథ్ నుంచి అనిల్ కుమార్ జాదవ్, నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి గెలుస్తారని ప్రకటించారు. ఇప్పటికి ఐదుగురు రెబల్స్ విజయం సాధించబోతున్నట్లు లగడపాటి ప్రకటించినట్లయింది.

ఇవి ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు కావని లగడపాటి చెబుతున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. పోలింగ్‌ పర్సంటేజీ పెరిగితే ఒకరకంగా.. పోలింగ్‌ పర్సంటేజీ తగ్గితే మరో రకంగా ఫలితాలు వస్తాయన్నారు. గతంలోకంటే పోలింగ్‌ పెరిగితే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని..గత ఎన్నికల్లో పోలింగ్ 68.5 శాతం పోలింగ్‌ నమోదయిందని పోలింగ్‌ పర్సంటేజీ తగ్గితే హంగ్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. 119కిగాను 100 సెగ్మెంట్లలో సర్వే నిర్వహించామని.. ఒక్కో సెగ్మెంట్లో 1000-1200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. ఇంతమంది ఇండిపెండెంట్లు గెలవడం ఆశ్యర్యకరమని లగడపాటి వ్యాఖ్యానించారు. వాగ్ధానాలకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఓటేయబోతున్నారని… విశ్లేషించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close