లక్షల కోట్లు ఎగ్గొట్టేస్తున్నారు – ఎవరి సొమ్ము ?

అప్పులు తీసుకోవడం ఎగ్గొట్టడం అనేది బడా పారిశ్రామికవేత్తలకు నిరంతర ప్రక్రియగా మారింది. గత పదేళ్లలో ఇలాంటి రుణ ఎగవేతలు 10 రెట్లు పెరిగాయని లెక్కలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి ఇప్పటి వరకు ఉద్దేశ్యపూర్వకంగానే రూ.2.4 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు బడా పారిశ్రామికవేత్తలు. 2012 నాటికి ఈ విలువ రూ.23,000 కోట్లుగా ఉంది. వీళ్లందరికీ స్థోమత లేక కాదు. కట్టే ఉద్దేశం లేక. అందుకే బ్యాంకులు మునిగిపోతున్నాయి.

రూ.25 లక్షల పైబడి రుణం తీసుకుని ఎగొట్టిన కేసులు 12,000 పైగా నమోదయ్యాయి. ఈ పదేళ్ల కాలంలో బ్యాంక్‌లకు అత్యధిక రుణాలు ఎగ్గొట్టిన వారిలో విజయ మాల్యా, నీరవ్‌ మోడీ సహా ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో గుజరాత్ వ్యాపారులదే ప్రధాన పాత్ర. గుజరాత్‌ కేంద్రంగా ఎబిజి షిప్‌యార్డ్‌ను నిర్వహిస్తున్న రిషి అగర్వాల్‌ రూ.6,382 కోట్లు ఎగ్గొట్టారు. ఆ తరవాత దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ వరకూ చాలా సంస్థలు ఈ జాబితాలోకి చేరాయి. అయితే ఇందులోని వాళ్ల ఆస్తులు వేలం వేయలేదు.. వాళ్లెవరూ జైళ్లకు వెళ్లలేదు. కొంత మంది పారిపోయారు. కొంత మందిపై కేసులు నమోదయ్యాయి. కానీ అవి ఎంత కాలం సాగుతాయో ఎవరూ చెప్పలేరు.

కార్పొరేట్లకు రుణాలు ఇచ్చి నష్టపోయిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వాటా 95 శాతం. అంటే అంతా ప్రజల డిపాజిట్ల సొమ్మే. ఒక్క ఏడాది రైతులకు పంట దిగుబడి రాక వారు తీసుకున్న ఒక్కటి, రెండు లక్షల రూపాయల రుణాలను వసూలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పెట్టే బ్యాంక్‌ అధికారులు, పారిశ్రామిక వర్గాల పట్ల మాత్రం భిన్నమైన వైఖరీని అవలంభిస్తున్నాయి. కనీసం రుణ ఎగవేతల పేర్లు కూడా బయట పెట్టేందుకు అంగీకరించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతీ యాభై ఇళ్లకు వైసీపీ తరపున ఇంకొకరు నిఘా !

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం పన్నులుగా కట్టిన సొమ్మును ఇస్తూ.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వ్యక్తిని నియమించింది. వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ...

“వారాహి” రంగు మార్చక తప్పదా !?

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి హాట్ టాపిక్ అయింది. యుద్ధ ట్యాంక్‌ను పోలి ఉండటం.. సేనాని ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉండటంతో ఈ వాహనం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే...

ముద్ర పడింది – టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ పంపింది. కేసీఆర్ ఈ లేఖను...

షూటింగులు బంద్.. అట్టర్ ఫ్లాఫ్ షో

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలని పరిష్కరించడానికి నిర్మాతలు అంతా కలసి షూటింగ్ బంద్ కి పిలుపునిచ్చారు. దాదాపు ముఫ్ఫై రోజులు షూటింగులు నిలిపివేశారు. తాజాగా నిర్మాత కళ్యాణ్ ఈ షూటింగ్ బంద్ ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close