ఎన్నికలకు ముందు బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్.. విశాఖ తీరంలో అనుమానాస్పదంగా ఉండటంతో చెక్ చేశారు. అందులో డ్రైఈస్ట్ పేరుతో హెరాయిన్ తెచ్చారని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత అది డ్రై ఈస్టేనని తేల్చి కేసును ముగించారు. కానీ దాని చుట్టూచాలా రాజకీయం జరిగింది.
ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అలాంటి భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుకున్నారు. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ నిర్వహించారు. ఫ్యాక్టరీలోపెద్ద ఎత్తున MD డ్రగ్స్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో దాడి చేశారు. 32 వేల లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఇది రూ. 12 వేల కోట్ల విలువైనదని వారు ప్రకటించేశారు. 13 మందిని అరెస్ట్ చేశారు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ గుట్టురట్టు చేశామని.. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించామని ప్రకటించారు.
చర్లపల్లిలో కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారీ అవుతున్నట్లుగా మహారాష్ట్ర అధికారులు చెప్పారు. ముంబైలో బంగ్లాదేశీ మహిళ అరెస్ట్‌తో బయటపడ్డ డ్రగ్స్ గుట్టు ఆధారంగా దాడులు చేసినట్లుగా ప్రకటించారు. నిజంగా కెమికల్స్ పేరుతో డ్రగ్స్ తయారు చేసే యూనిట్లు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడూ పట్టుకుంటూనే ఉంటారు. కానీ ఇలా ఏకంగా వేల కోట్లు విలువైన డ్రగ్స్ అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నారు. కానీ అంత సరుకు ఉంటుందా.. అనేది మాత్రం చాలా మందికి డౌన్. కానీ చెప్పుకోవడానికి చాలా పెద్ద సంఖ్య కావడంతో మీడియాలో సహజంగానే హైలెట్ అవుతుంది.