ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య !

ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య కారణాలు, మానసిక ఒత్తిడితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. గత డిసెంబర్‌లోనే ఉమామహేశ్వరి చిన్నకుమార్తె వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం విషాదం నెలకొంది.

ఎన్టీఆర్ కుటుంబంలో ఎక్కువ మంది పబ్లిక్ లైఫ్‌కి దూరంగా ఉన్నారు. వారిలో ఉమామహేశ్వరి కూడా ఒకరు. చాలా అరుదుగా మాత్రమే ఆవిడ బయట కనిపిస్తూంటారు. కుటుంబ వేడుకల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో సోదరి నారా భువనేశ్వరి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడటంతో … ఖండిచేందుకు మీడియా ముందుకు వచ్చారు. సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.చంద్రబాబు, దగ్గబాటి కుటుంబాలు చాలా రోజుల తర్వాత కలిసిన సందర్భాలు ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లికి సంబంధించిన వేడుకల్లోనే.

ఉమామహేశ్వరి మృతి వార్త తెలిసిన తర్వాత కుటుంబసభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబసభ్యులు వచ్చారు. బాలకృష్ణ కూడా ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబాన్ని విషాదంలో నింపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close