రివ్యూ: లాఠీ

Laththi movie telugu review

తెలుగు360 రేటింగ్ 2.25/5

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో విశాల్. తన కెరీర్ లో యాక్షన్ సినిమాలే ఎక్కువ. `లాఠీ` కూడా అలాంటి క‌థే. ఏ. వినోద్ కుమార్ దర్శకత్వం వచించిన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటించింది. రమణ, నంద నిర్మించారు. విశాల్ కి వున్న విజయాల్లో యాక్షన్ సినిమాలదే పై చేయి. మరోసారి యాక్షన్ ని నమ్ముకున్న విశాల్ కు ‘లాఠీ’ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ? ‘లాఠీ’తో విశాల్ చేసిన డ్యూటీ ఏంటి?

మురళీ కృష్ణ(విశాల్) సస్పెండైన ఓ కానిస్టేబుల్. భార్య కవిత (సునైనా) ఓ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంటుంది. వీరికి పదేళ్ళ బాబు కూడా ఉంటాడు. మురళి మళ్ళీ ఉద్యోగంలో చేరడం కోసం ఉన్నత అధికారుల చుట్టూ తిరుగుతుంతాడు. డిఐజి ప్రభు రికమండేషన్ తో మురళికి మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది. సూర పెద్ద రౌడీ. క్రూరుడు.ప్రభుత్వమే అతడి గుప్పెట్లో వుంటుంది. సూర కొడుకు వీర. తండ్రి సూర కంటే అతి క్రూరుడు వీర. మర్డర్లు, మానభంగాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు మీద తిరిగే మృగం వీర. ఒక రోజు డిఐజి ప్రభు కూతురి పట్ల అతి దారుణంగా ప్రవర్తిస్తాడు వీర. తన కూతురికి జరిగిన అన్యాయన్ని ఉన్నత అధికారులకు చెప్తాడు ప్రభు. వీరతో పెట్టుకోవడం మంచిది కాదని సెలవిస్తారు వున్నత అధికారులు. అయితే వీరకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్న ప్రభు.. వీర మొహం కప్పి ఒక చోట బంధించి కానిస్టేబుల్ మురళితో దారుణంగా కొట్టించి చెత్త కుప్పలో పారేస్తారు. తనను కొట్టింది కానిస్టేబుల్ మురళి అని తెసుకున్న వీర ఏం చేశాడు ? అసలు మురళి ఎందుకు సస్పెండ్ అయ్యాడు ? వీర కారణంగా మురళి ఎలాంటి ప్రమాదాల్ని ఎదురుకున్నాడనేది మిగతా కథ.

‘లాఠీ’నే ఆయుధంగా డ్యూటీ చేసే ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ కథ ఇది. కానిస్టేబుల్ మురళిని చంపడానికి పెద్ద సైన్యం కూడిన రౌడీ మూకలు ఓ పెద్ద నిర్మాణ భవనంలో గాలిస్తుండగా మొదలైన కథ..ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. హీరో పరిచయం, అతని కుటుంబం, మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి మురళి చేసే ప్రయత్నాలు.. ఒక సామాన్య కానిస్టేబుల్ కథని పరిచయం చేస్తాయి. కేవలం ‘లాఠీ’తో ఒక రౌడీ గుంపుని తరిమికొట్టి కోర్టులో నిందితుడిని హాజరుపరిచే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ‘లాఠీ’తో మురళి చేయబోయే యుద్ధానికి ఈ సన్నివేశం మంచి పరిచయమే. సూర ని పరిచయం చేసే ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా వుంటుంది. సూర ఎంత పవర్ ఫుల్ అంటే.. పెళ్లీడుకి వచ్చిన కూతుర్లు వున్న ముగ్గురు మంత్రులని, ముఖ్యమంత్రి క్యాబిన్ లోకి పిలిచి .. మీ ముగ్గురిలో ఎవరో ఒకరు మీ కూతురిని సూర కొడుకు వీరకిచ్చి పెళ్లి చేయాలని డీల్ చేసే ఎపిసోడ్ విలనిజానికి పీక్స్ లో వుంటుంది. అయితే డిఐజి ప్రభు, మురళితో వీరని కొట్టించిన సన్నివేశం తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఉత్కంఠగా రాయాల్సింది. కానీ మురళి పట్టుకోవడానికి విలన్ బ్యాచ్ రింగ్ టోన్ సాయం తీసుకొని ఒకసారి వెతకడం, తర్వాత కృష్ణ అనే చివరి పేరుతో మరోసారి వెదకడం.. ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడుతుంది. వీర ని మురళి ఎలా ఎదుర్కుంటాడనే అనే పాయింట్ తోనే ఇంటర్వెల్ బాంగ్ కూడా పడిపోతుంది.

‘లాఠీ’ ద్వితీయార్ధం మొత్తం నిర్మాణంలో వున్న ఓ పెద్ద భవనంలో డిజైన్ చేశారు. అతి భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇది. ఇన్ హేలర్ లేకపోతే సరిగ్గా ఊపిరి తీసుకోలేని పదేళ్ళ కొడుకుని పట్టుకొని, ఒక పెద్ద ప్రైవేట్ సైన్యం లాంటి గూండాల గుంపులతో వార్ చేసి, హీరో ఎలా భయపడ్డాడనేది సెకండ్ హాఫ్. ఇంత భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినప్పుడు ప్రేక్షకుడికి అది ఎంత ఆసక్తికరంగా వుంటుందో చూసుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పెద్ద కసరత్తు చేసినట్లు కనిపించదు. మొత్తం భారం అంతా యాక్షన్ కొరియోగ్రఫర్ పై పెట్టారు. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో కథనం కూడా భాగమైతేనే రక్తికడుతుంది. నిర్మాణంలో వున్న భవనం వెనుక హీరో వేసిన ‘వల’ అన్న ట్విస్ట్ ఆసక్తికరంగానే వుంటుంది. అయితే అదొక్కటే సరిపోలేదు. అలాంటివి మరికొన్ని డిజైన్ చేసుకోవాల్సింది. హీరో, విలన్స్ ఒకేచోట చాలా సమయం ఇరుక్కున్నప్పుడు .. వారి మధ్య మైండ్ గేమ్ కూడా అవసరం. అలాంటిదేమి ఇందులో కనిపించదు. పైగా బాబు రూపంలో సెంటిమెంట్ రాబట్టుకోవాలని చూశారు. అది కాస్త ‘ఓవర్’ సెంటిమెంట్ గా మారింది. ఇలాంటి కథల్లో ఫైనల్ గా హీరోనే గెలుస్తాడు. అలాంటప్పుడు యాక్షన్ సీక్వెన్స్ షార్ఫ్ గా వుండాలి. కానీ ‘లాఠీ’లో యాక్షన్ అంతా నింపాదిగా సాగుతుంటుంది. బహుశా కానిస్టేబుల్ ఫైట్ అంటే ఇలానే ఉంటుందని దర్శకుడి భావనేమో.

విశాల్ యాక్షన్ కి పెట్టింది పేరు. రా, ఇంటిల్జెంట్ ఆఫీసర్స్ లాంటి పాత్రలు చేసిసిన విశాల్.. ఓ సాధార‌ణ‌ కానిస్టేబుల్ పాత్ర చేయడం కాస్త వైవిధ్యంగా వుంది. మురళి పాత్రకు న్యాయం చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఫైట్స్ సహజంగా చేశాడు. నిర్మాణ భవనంలో జరిగిన ఎపిసోడ్ లో ఎక్కడా డూపులు వాడినట్లు కనిపించదు. అయితే చివర్లో బాబు కోసం ఏడ్చే సన్నివేశం మాత్రం ఓవర్ దోస్ డ్రామా అనిపిస్తుంది. బహుశా తమిళ్ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెటుకొని అంత డ్రామా చిత్రీకరించారేమో. సునైనా అందంగా వుంది. పద్దతిగా కనిపించింది. ప్రభు పాత్ర చిన్నదే. సూర, వీర పాత్రలలో నటించిన నటులు భయపెట్టే విలనిజం చూపించారు. బాబు నటన కూడా బావుంది. మిగతా నటులు పరిధిమేర చేశారు.

యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతానికి ఫుల్ మార్కులు పడతాయి. యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ కి చాలా పని దొరికింది. సెకండ్ హాఫ్ అంతా తనే చూసుకున్నాడు. నిర్మాణ భవనంలో ఏకంగా ఒక యుద్ధమే సృష్టించాడు. మిషన్ గన్స్ ఫైర్ అయ్యే సన్నివేశం పీటర్ హెయిన్ మార్క్ ని చాటుతుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. సినిమాలో యాక్షన్ ని ఎంజాయ్ చేయాలంటే మంచి కథనం వుండాలి. కథనంలో పట్టు ఉంటేనే యాక్షన్ రక్తికడుతుంది. ‘లాఠీ’లో ఆ పట్టు తప్పింది.

ఫినిషింగ్ ట‌చ్‌: లాఠీ ‘విరిగింది’

తెలుగు360 రేటింగ్ 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close