అస్తమానూ ప్రశాంతంగా ఉండడం కష్టమే. ముఖ్యంగా సెలబ్రెటీలకూ. కానీ వాళ్లకు కావల్సింది ఆ లక్షణమే. ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో. అది ఏమాత్రం తప్పినా కొత్త తలనొప్పులు వస్తాయి. ఈ విషయంతో లావణ్య త్రిపాఠీ ఇంకా పాఠాలు నేర్చుకోలేదేమో అనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి రీసెంట్ గా ఫ్యాన్స్ తో చాట్ చేసింది. తన ఇన్స్ట్రాలో. అందులో కొన్ని ప్రశ్నలకు నిర్లక్ష్యంగా, ఆవేశంగా సమాధానాలు చెప్పింది. మరీ ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు.
లావణ్య చేతికి ఓ ఉంగరం కనిపిస్తోంటే, `అది నిశ్చితార్థ ఉంగరమా` అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి అవుననో, లేదనో సమాధానం చెబితే సరిపోతుంది. కానీ `ఆడవాళ్లు ఉంగరాలు తొడుక్కోకూడదా? తొడుక్కుంటే పెళ్లేనా? అది నా సొంత డబ్బులతో కొనుక్కున్న ఉంగరం. నాకు నేనిచ్చుకున్న కానుక` అంటూ కాస్త రివర్స్ గా మాట్లాడింది. `పెళ్లెప్పుడు` అనే ప్రశ్నకూ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది. `ఈ ప్రశ్న మా అమ్మానాన్నలే ఇంకా అడగలేదు. నీకెందుకు` అంటూ కాస్త రుసరుసలాడింది. వ్యవహారం చూస్తుంటే లావణ్య కాస్త ఫ్రస్ట్రేషన్ లో ఉందేమో అనిపిస్తోంది. లావణ్య ఫ్యాన్స్ ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదేమో..?