లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 8న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ని బయటికి వచ్చింది. ట్రైలర్ బిగినింగ్ లో ‘సర్రియల్ కామెడీ’ అని పరిచయం చేస్తూ ఓపెన్ చేసిన ఈ ట్రైలర్ కాస్త డిఫరెంట్ గా వుంది.
సినిమా షూటింగ్ కూడా చాలా వైవిధ్యంగా చేసినట్లు కనిపిస్తుంది. మొత్తం ఒక హోటల్ లాంటి సెటప్ వుంది. ట్రైలర్ లో లావణ్య తో పాటు వెన్నెల కిశోర్, సత్య, హర్ష ఇలా చాలా మంది కనిపించారు. ‘ఆవేశం అగ్గి పుల్ల లాంటింది ఒక్కసారే వెలిగించవచ్చు. కానీ ఆశయం లైటర్ ఎన్నిసార్లయినా వెలిగించవచ్చు”. వాడు ప్రోఫిషనల్ కిల్లర్ అయితే నేను పెయిన్ కిల్లర్. రైమింగ్ బావుంది కానీ టైమింగ్ దరిద్రంగా వుంది” అనే డైలాగులు ట్రైలర్ లో పేలాయి. చివర్లో దివాలి పండగలా గన్స్ ఫైర్ చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ చూస్తుంటే ఏదో కొత్త జోనర్ ట్రై చేసారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.