కారు, బైక్ లాంటివి బయటకు తీసే అవసరం లేకుండా .. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కోసం పడిగాపులు పడే చాన్స్ లేకుండా ఉండే నినాస సదుపాయం ఎంత హాయిగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వరకూ ఎంత పెద్ద ఎగ్జిక్యూటివ్స్ లు అయినా సరే.. ఇంటి నుంచి నడుచుకుంటూ మెట్రో వరకూ వచ్చి అక్కడినుంచి ఆఫీసుకు వెళ్తారు. కానీ ఇండియాలో మాత్రం అంతటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అందుబాటులోకి రాలేదు. కానీ కొన్ని సంస్థలు మాత్రం అలాంటి కాన్సెప్ట్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు కొన్ని మాల్స్ అనుసంధానం ఉంది. పంజాగుట్ట మెట్రో స్టేషన్ లో దిగితే గెలెరియా మాల్ లోకి వెళ్లవచ్చు. అదే కాన్సెప్ట్ తరహాలో ఎల్పీనగర్ మెట్రోలో దిగితే.. నేరుగా అపార్టుమెంట్ కాంప్లెక్స్ లోకి వెళ్లేలా ఓ ప్రాజెక్టు రెడీ అవుతోంది. దాని పేరు ఆనంద నిలయం. సీరిస్ ఫ్యాక్టరీ ఉన్న స్థలాన్ని ఇప్పుడు వాసవి సంస్థ అభివృద్ధి చేస్తోంది. అక్కడ ఆనంద నిలయం పేరుతో భారీగా అపార్టుమెంట్లు నిర్మిస్తోంది. ఇందులో మధ్యతరగతితో పాటు లగ్జరీ కోరుకునేవారికీ ఇళ్లను నిర్మమిస్తోంది. ఎల్బీ నగర్ మెట్రోతో స్కై వాక్ కనెక్టివిటీని సైతం రూపొందిస్తున్నారు. ఓ అపార్ట్మెంట్ వాక్ వేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్‌తో కనెక్ట్ చేయడం ఇదే మొదటి సారిగా భావిస్తున్నారు.
ఇలా మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉండే అపార్టుమెంట్ కాంప్లెక్స్ లు.. అనుసంంధానమైతే.. అలాంటి నివాసాల నుంచి రోడ్ల మీదకు వచ్చే కార్లు తగ్గిపోతాయి. దాని వల్ల ట్రాఫిక్ కూడా తగ్గిపోతుందనడంలో సందేహం ఉండదు. మెట్రోను విస్తరించి.. ఇలా భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో కనెక్ట్ అయ్యేలా చేస్తే.. బాగుంటుందని అనుకుంటున్నారు. ఆనందనిలయం ప్రాజెక్టు ఎల్బీ నగర్ సెంటర్ లో ఉంటుంది కాబట్టి హాట్ కేకలు మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.