అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఎప్స్టీన్ ఫైళ్లు మరోసారి బయటపడి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మైనర్ల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి జైలులో మరణించిన జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన రహస్య పత్రాలను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు కేవలం ఊహాగానాలు కాదని, అధికారిక రికార్డుల్లో నిక్షిప్తమైన వివరాలని తేలడంతో అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
13 ఏళ్ల బాలికపై ట్రంప్ లైంగిక వేధింపులు
1980వ దశకంలో ఎప్స్టీన్ నివాసంలో ఒక 13 ఏళ్ల బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి 16 కొత్త పేజీల ఎఫ్‌బీఐ దర్యాప్తు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు 2019లోనే ఎఫ్‌బీఐ అధికారుల ముందు హాజరై, ఆనాడు జరిగిన అకృత్యాన్ని అత్యంత వివరంగా వాంగ్మూలం ఇచ్చింది. ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్న ఈ రికార్డులు ఇప్పుడు బయటకు రావడం, అందులో బాధితురాలు వివరించిన తీరు ట్రంప్ నిర్వాకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ట్రంప్‌కు గట్టి షాక్
ఈ పరిణామం ట్రంప్‌ను కేవలం నైతిక రక్షణలో పడేయడమే కాకుండా, కఠినమైన క్రిమినల్ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. 2026 మధ్యంతర ఎన్నికలు జరగనున్న సమయమంలో ట్రంప్‌కు ఇది ఒక భారీ పొలిటికల్ బాంబు లాంటిదని డెమొక్రాట్లు అభివర్ణిస్తున్నారు. అప్పటి ఎఫ్‌బీఐ రికార్డులు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ప్రత్యేక విచారణాధికారిని నియమించాలని విపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. ట్రంప్ బృందం వీటిని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నప్పటికీ, అధికారిక పత్రాల సాక్షిగా వస్తున్న ఆధారాలను ఎదుర్కోవడం వారికి అంత సులభం కాకపోవచ్చు.
కేసు తీవ్ర మరింత పెరిగే అవకాశం
రాబోయే రోజుల్లో ఈ కేసు తీవ్రత పెరిగితే, ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్స్టీన్ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రముఖుల జాబితాలో ట్రంప్ పేరు పదేపదే వినిపించడం, ఇప్పుడు మైనర్ బాలికపై దాడికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలు లభించడం ఆయన పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తోంది. అమెరికా న్యాయ వ్యవస్థ ఈ సున్నితమైన అంశంపై ఏ విధంగా స్పందిస్తుందనే దానిపైనే ట్రంప్ భవితవ్యం ఆధారపడి ఉంది.
