లైఫ్ హ్యాపీ అవ్వాలంటే ఫేస్‌బుక్ వదిలేయాలి!

హైదరాబాద్: డెన్మార్క్‌లో జరిపిన ఒక అధ్యయనంలో ఫేస్‌బుక్‌ వాడుతున్నవారి కంటే వాడటం నిలిపేసినవారు సంతోషంగా ఉన్నట్లు తేలింది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హెగన్‌కు చెందిన ‘హ్యాపీనెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అన్ని వయసులవారూ ఉపయోగించే సోషల్ మీడియా కాబట్టి ఫేస్‌బుక్‌ను తాము ఎంచుకున్నామని వివరించింది. డెన్మార్క్‌లోని 1,095 మంది వ్యక్తులను తీసుకుని ఈ అధ్యయనం చేసింది. ముందుగా వారిని రెండుగా విభజించింది. ఫేస్‌బుక్‌లో ఉన్నవారిని ఒకవైపు, వాడటం ఆపేసిన వారిని మరొక వైపు తీసుకుని ఈ సర్వే చేసింది. ఒక వారం పాటు అధ్యయనం చేసిన తర్వాత, ఫేస్‌బుక్‌ వాడటం ఆపేసినవారిలో 88 శాతం మంది తమ జీవితాలతో తాము ముందుకంటే సంతృప్తికరంగా ఉన్నామని చెప్పారు. తమ సోషల్ లైఫ్, ఏకాగ్రత కూడా మెరుగుపడ్డాయని వెల్లడించారు. అధ్యయనం నిర్వహించిన వారు ఈ పరిణామంపై స్పందిస్తూ, తమకు ఏమి అవసరమో వాటిపై దృష్టి కేంద్రీకరించకుండా, ఇతరుల వద్ద ఉన్నవాటిపై దృష్టి పెట్టటం వలనే ఇలా జరుగుతోందని అన్నారు. అందువలనే ఫేస్‌బుక్‌లో ఉన్నవారు ఎక్కువగా అసూయతో, ఏకాగ్రతా లేమితోనూ బాధపడుతుంటారని చెప్పారు. మొత్తం మీద చూస్తే ఫేస్‌బుక్‌లో ఉన్నవారు, లేనివారికంటే 39 శాతం తక్కువ సంతోషంగా ఉన్నారని తేల్చారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘RRR’ ఫ్లాప్ అయితే పండ‌గేనా?

ఆర్జీవీ అంతే. ఎక్క‌డ కెలకాలో అక్క‌డ కెలుకుతాడు. పైగా త‌న సినిమా విడుద‌ల అవుతుంటే... ఆ కెలుకుడు కార్య‌క్ర‌మం ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. `క్లైమాక్స్‌` అనే సినిమాని ఇప్పుడు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నాడు...

ఆర్‌జీవీ… రీ రిలీజ్‌!‌

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా 'క్లైమాక్స్‌' సినిమాని విడుద‌ల చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సాయింత్రం నుంచే ఆ ర‌చ్చ మొద‌లు కానుంది. ఈ సినిమా చూడాలంటే వంద రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది. ఈ వ్యాపారం గిట్టుబాటు...

మీడియా వాచ్ : ఈనాడులో ఉద్యోగాలు సేఫ్.. జీతాలు కట్..!

దశాబ్దాలుగా ఎదురు లేకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈనాడు ఎప్పుడూ ఎదుర్కోనంత ఆర్థిక పరమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వనరులన్నీ తగ్గిపోగా.. నెలవారీ లోటు కోట్లలోనే ఉంటోంది. అదే సమయంలో......

‘పుష్ష‌’లో… స్టార్ల హంగామా

టాలీవుడ్ కి పాన్ ఇండియా మోజు ప‌ట్టుకుంది. అయితే.. పాన్ ఇండియా ప్రాజెక్టు అంత ఈజీ కాదు. బోలెడ‌న్ని హంగులుండాలి. అన్ని భాష‌ల‌కూ, అన్ని ప్రాంతాల‌కూ న‌చ్చే క‌థ‌లు ఎంచుకోవాలి. దానికి త‌గ్గ‌ట్టు...

HOT NEWS

[X] Close
[X] Close