అప్పిరెడ్డి కూడా దొరికారు… ఇక మిగిలింది జోగి ర‌మేష్ ఒక్క‌రేనా?

టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించిన నేప‌థ్యంలో… వైసీపీ నాయ‌కుల అరెస్టులు కొన‌సాగుతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ భ‌యంతో హైద‌రాబాద్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఉద‌యం పోలీసులు అరెస్ట్ చేయ‌గా, తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదే కేసులో మాజీ మంత్రి జోగి ర‌మేష్, దేవినేని అవినాష్‌, త‌ల‌శిల ర‌ఘురాంల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 12 బృందాలు హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, ప‌ల్నాడు, గుంటూరు ప్రాంతాల్లో గాలింపు చేప‌ట్టాయి. అరెస్ట్ భ‌యంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఉద‌యం అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న్ను గుంటూరు జైలుకు త‌ర‌లించనున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా కాసేప‌ట్లో పోలీసులు కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయితే, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎక్క‌డున్నారు…? అన్న అంశంపై పోలీసుల వేట కొన‌సాగుతోంది. ఆయ‌న్ను కూడా ఒక‌ట్రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడు రాజ్ తరుణ్… ఇప్పుడు సుహాస్

చిన్న సినిమా టాక్ బావుంటే గానీ థియేటర్స్ కి జనం రారు. కంటెంట్ నమ్ముకొని చాలా ప్లాన్ గా చేసుకొని తమ మార్కెట్ ని కాపాడుకోవడం ద్రుష్టిపెడుతుంటారు హీరోలు. అయితే కొన్నిసార్లు పరిస్థితులు...

ఏపీకి మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం !

మేఘా గ్రూపు కంపెనీలు ఏపీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చాయి. వరద బాధితుల కోసం బడా కాంట్రాక్టర్లు స్పందించలేదని విమర్శలు వస్తున్న సమయంలోనే మేఘా కృష్ణారెడ్డి సోదరులు విజయవాడలో చంద్రబాబును కలిశారు....
video

రీల్స్ ని టార్గెట్ చేసిన రజనీ

https://www.youtube.com/watch?v=AiD6SOOBKZI సినిమా పాట ఈక్వేషన్ మారిపోయింది. మంచి పల్లవి, ఆకట్టుకునే చరణాలు, కలకాలం నిలిచిపోయే ట్యూన్ కోసం శ్రమించేవారు సంగీత దర్శకులు. ఇది గతం. ఇప్పుడంతా రీల్స్ ట్రెండ్. ట్యూన్ చేస్తే రీల్స్ లో...

భారత్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ

మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి అనుమానాస్పద కేసు పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక క్వారంటైన్‌లకు తరలించే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close