14మంది అమ్మాయిల‌తో.. ‘లైగ‌ర్‌’ ఫైట్‌!

‘లైగ‌ర్‌’… ఈ సినిమాతో ఇండియాని షేక్ చేసేస్తా – అంటూ ముందే స్టేట్‌మెంట్ ఇచ్చి బిగ్ ఫైట్‌కి సిద్ధ‌మయ్యాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆగ‌స్టు 25న లైగ‌ర్ విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్‌తో… ప్ర‌మోష‌న్ల‌కు చిత్ర‌బృందం శ్రీ‌కారం చుట్టింది. ఈ సినిమాలో చాలా స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని థియేట‌ర్లో బ్లాస్ట్ చేయాల‌న్న‌ది పూరి ఉద్దేశ్యం. వాటిలో… ఓ సూప‌ర్ ఫైట్ ఉంద‌ట‌.

ప‌ద్నాలుగు మంది అమ్మాయిల‌తో విజ‌య్ ఫైట్ చేసే సీన్‌.. ఈ సినిమాకే హైలెట్ గా నిల‌వ‌బోతోంద‌ని టాక్‌. ఆ ప‌ద్నాలుగుమంది అమ్మాయిలూ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నిపుణులే. వాళ్ల‌ని పూరి ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు. ఈ ఫైట్ కే భారీ మొత్తం ఖ‌ర్చు చేయాల్సివ‌చ్చింద‌ట‌. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే ఈ ఫైట్… థియేట‌ర్లో ఓ బ్లాస్ట్ లా పేల‌బోతోంద‌ని టాక్‌. మైక్ టైస‌న్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. టైస‌న్‌తో లైగ‌ర్ త‌ల‌ప‌డేది క్లైమాక్స్‌లోనే. ఆ ఫైట్ కూడా ఇంటర్నేష‌న‌ల్ స్థాయిలో రూందించార‌ని తెలుస్తోంది. ఇవి కాకుండా ఈ సినిమాలో ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని చిత్ర‌బృందం ఒకొక్క‌టిగా రివీల్ చేయాల‌ని భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close