ఈ ఆదివారం రాత్రి కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లతో సంఘిభావం : మోడీ

ఓ ఆదివారం జనతా కర్ఫ్యూ రోజున చప్పట్ల కాన్సెప్ట్ ను అమలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి .. మరో భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రజల ముందుకు వచ్చారు. ఈ ఆదివారం అంటే ఐదో తేదీన రాత్రి తొమ్మిది గంటలకు అందరూ ఇళ్లలలో లైట్లే ఆర్పేసి.. కొవ్వొత్తులు, టార్చ్ లైట్లతో.. కరోనాపై సమరానికి సంఘిభావం తెలియచేయాలని పిలుపునిచ్చారు. ఒక వేళ కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు లేకపోతే.. సెల్ ఫోన్ లైట్లతో ఆ సంఘిభావం తెలియచేయాలని వెసులుబాటు ఇచ్చారు. అది కూడా తొమ్మిది నిమిషాల పాటే.

దేశ ప్రజలతో ఓ చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటానని గురువారం మోడీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఏదో రిలీఫ్ వస్తుందని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే.. మోడీ కొత్తగా… కరెంట్ ఆపేసి.. కొవ్వొత్తులు, టార్చ్ లైట్ల కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే.. కరోనాను జయించినట్లేనని మోడీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. భారతదేశం లాక్ డౌన్ ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ దారి చూపిందని.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయని మోడీ ప్రకటించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలన్నారు. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు 130 కోట్ల మంది ..ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ప్రజలు వెలిగించే దీపాలు కరోనాపై పోరాడే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.

ఇప్పటికి లాక్ డౌన్ ప్రకటించి తొమ్మిది రోజులు అయిందని రాబోయే పదకొండు రోజులు అత్యంత కీలకమని మోడీ ప్రకటించరు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం ఇప్పుడు ఓ రకమైన భయాందోళనలు ఉన్నాయి. ప్రజలు పది రోజులుగా ఇంటి పట్టునే ఉన్నారు. ఆర్థిక సమస్యలతో పాటు.. ఇతర ఆరోగ్య సమస్యలకూ సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్ని రోజులు ఇలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభవుతోంది. ఇలాంటి సమయంలో మోడీ.. అందరిలోనూ మళ్లీ స్ఫూర్తి నింపడానికి ఈ టార్చ్ లైట్లు, కొవ్వొత్తుల కాన్సెప్ట్‌ను అమల్లోకి తెస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close