రివ్యూ : ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’

like share and subscribe Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 1.25/5

దర్శకుడు మేర్లపాక గాంధీకి మంచి కామెడీ టైమింగ్ వుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్స్ ఆయన ఖాతాలో వున్నాయి. అయితే నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం మాత్రం ఆకట్టుకోలేదు. మాస్ట్రో, ఎక్ మినీ కథ ఓటీటీకి పరిమితమయ్యాయి. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆయన నుంచి థియేటర్ సినిమాగా వచ్చింది ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ప్ర‌తిభావంతుడైన నటుడిగా పేరుతెచ్చుకున్న సంతోష్‌ శోభన్‌, జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా, శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి.. ఇలా ప్రామిసింగ్ కాంబినేషన్ సెట్‌ కావడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కామెడీ సినిమాలని డీల్ చేయడంతో తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ కోసం ఒక సీరియస్ కామెడీ ట్రాక్ ని ఎంచుకున్నాడు. మారా సీరియస్ కామెడీ ఎలాంటి వినోదాల్ని పంచింది ? ప్రేక్షకులు లైక్ చేస్తారా లేదా డిస్ లైక్ చేస్తారా ?

1990. ఆంధ్రప్రదేశ్ లో ఒకానొక అడవి ప్రాంతం. తన అధికారంతో అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ నాయకుడిని పీపీఎఫ్ (పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్) కాల్చి చంపుతుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రభుత్వం ‘పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్’ నాయకులని శాంతి చర్చలకు పిలుస్తుంది. ప్రభుత్వంతో శాంతి చర్చలకు వెళ్ళిన ముగ్గురు పీపీఎఫ్ నాయకులు కనిపించకుండాపోతారు. దీని వెనుక డీజీపీ హస్తం వుందని పీపీఎఫ్ నాయకుడు గోపన్న భావిస్తాడు. డిజీపీని చంపడానికి ప్లాన్స్ వేస్తుంటాడు. కట్ చేస్తే ..2022. వసుధ (ఫారియా)పాపులర్ యూట్యూబర్. ప్ర‌కృతి అందాలని షూట్ చేయడానికి అరుకు వెళ్తుంది. అన్నట్టు.. వసుధ తండ్రే డీజీపీ. విప్లవ్ (సంతోష్ శోభన్) బడ్డింగ్ యూట్యూబర్. అతడి ఛానల్ కి ముఫ్ఫై మందే సబ్‌స్క్రైబ్‌ చేసుంటారు. అవి కూడా చేతి నుంచి ఫోన్ లాక్కొని బలవంతంగా చేసినవే. ఎలాగైనా పెద్ద యూట్యుబర్ కావాలని జాక్ డేనియల్స్ (సుదర్శన్ ) అనే డీవోపీ వెంటబెట్టుకొని అరుకువెళ్తాడు. అక్కడ వసుధని చూసి ప్రేమలో పడిపోతాడు. అంతా సజావుగా సాగుతున్న క్రమంలో పీపీఎఫ్ గ్యాంగ్ కి చిక్కుతారు ఈ ముగ్గురు. వసుధ డీజీపీ కూతురని తెలుసుకున్న పీపీఎఫ్ నాయకుడు గోపన్న ఏం చేశాడు ? పీపీఎఫ్ నాయకుల్లో కనిపించకుండాపోయిన ముగ్గురు ఏమయ్యారు ? చివరికి విప్లవ్, వసుధ అడవి నుంచి ఎలా బయటపడ్డారనేది మిగతా కథ.

కామెడీకి కూడా కొన్ని లిమిటేషన్లు వుంటాయి. రొమాంటిక్, హారర్, డార్క్, క్రైమ్.. ఈ జోనర్స్ అన్నిటికీ కామెడీ టచ్ ఇవ్వొచ్చు. అయితే సిద్ధాంతాలని కామెడీ చేయలని ప్రయత్నించడం అంత తెలివైన పనికాదు. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఎంచుకున్న తర్వాత కచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. అంతేగానీ ఒకరు బలంగా నమ్మిన సిద్ధాంతాలని కామెడీ చేసేసి వాటి నుంచి హాస్యం పుట్టించాలని ప్రయత్నిస్తే రివర్స్ లో నవ్వులుపాలవ్వాల్సి వస్తోంది. తన తొలి సినిమాలో కేవలం ఒక ట్రైన్ జర్నీలో హిలేరియస్ గా నవ్వించేసిన దర్శకుడు మేర్లపాక గాంధీ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ కోసం ఎంచుకున్న నేపధ్యం చూస్తే జాలి పుడుతుంది. ప్రేక్షకుడ్ని నవ్వించడానికి ఇంతకంటే మరో నేపథ్యం దొరకలేదా? అనిపిస్తుంది.

సినిమాని ఎంజాయ్ చేయాలంటే మొదట ఆడిటోరియంని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ‘పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్’అని కథ మొదలుపెట్టాడు. నిజంగా అది చాలా సీరియస్ మూడ్ లో వుంటుంది. అయితే ఇది సీరియస్ సినిమా కాదు.. కామెడీ.. నవ్వండని కొన్ని కామెడీ సీన్లు వస్తాయి. అయితే ఈ మూడ్ షిఫ్ట్ సరిగ్గా కుదరలేదు. కామెడీ సీన్లు కూడా పగలబడి నవ్వేలా ఏం వుండవు. నిజానికి ఈ కథ మొదలుపెట్టడమే చాలా వీక్ గా వుంటుంది. హీరో, హీరోయిన్ పీపీఎఫ్ చేతిలో చిక్కిన తర్వాత అసలు బయటపడతారా లేదా ? అనేది సస్పెన్స్. అయితే మొదటి సీన్ లో హీరో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటపడినట్లు చూపిస్తాడు దర్శకుడు. దీంతో అడవిలో జరిగిన కిడ్నాప్ డ్రామా అంతా తేలిపోతుంది.

పీపీఎఫ్ అని పేరు పెట్టారు కానీ.. నిజానికి అదొక నక్సల్ మూమెంట్. ఈ నేపధ్యంలో వచ్చిన సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇటివల వచ్చిన కొన్ని సినిమాల దానిని రుజువు చేశాయి. కానీ హిలేరియస్ సినిమాలు చేస్తాడనే పేరుతెచ్చుకున్న గాంధీ.. ఈ నేపధ్యంలో కామెడీ పుట్టించడానికి ప్రయత్నించడం వృధా ప్రయాసగానే మిలిగిపోయింది. ఏదో ట్రెండీగా వుందని ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ అనే టైటిల్ పెట్టారు కానీ యూట్యుబర్ నేపధ్యంతో ఈ కథకు వచ్చిన లాభం ఏమీ లేదు. అసలు ఈ కథ మీద దర్శకుడు పెద్దగా వర్క్ చేసినట్లు కూడా కనిపించదు. ఐడియా బావుందని సెట్స్ మీదకు హడావిడిగా వెళ్ళిపోయారు తప్పితే పగడ్బందీ స్క్రిప్ట్ వర్క్ చేసిన సీన్ ఒక్కటీ ఇందులో కనిపించదు.

సంతోష్ శోభన్ మంచి నటుడు. విప్లవ్ పాత్రలో సహజంగా కనిపించాడు. వ్యూస్, లైక్స్ కోసం అతడు పడే తాపత్రయం నవ్విస్తుంది.అయితే స్క్రిప్ట్ లోబలం లేకపోవడం వలన చాలా సన్నివేశాలు సోసోగానే వెళ్ళిపోతుంటాయి. డ్యాన్సుల్లో ఈజ్ చూపించాడు. ఫారియా అందంగా కనిపించింది. సెకండ్ హాఫ్ లో నాటకం సాంగ్ లో ఫారియాకు నటించే అవకాశం దక్కింది. ఫరియాలో నటనకు ఆ సాంగ్ అద్దం పట్టింది. బీచ్ సాంగ్ లో చేసిన డ్యాన్సులు కూడా బావున్నాయి. ఇందులో సీరియస్ గా కామెడీ పండించే భాద్యత బ్రహ్మన్న పాత్రలో బ్రహ్మాజీ తీసుకున్నాడు. తనది సీరియస్ కామెడీ ఫేసు. కొన్ని చోట్ల నవ్విస్తాడు. సుదర్శన్ పాత్ర సినిమా అంతా వునప్పటికీ ఆ పాత్రని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. సప్తగిరిది చిన్న పాత్రే అయినా తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు పరిధి మేర నటించారు.

నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. ప్రవీణ్ లక్కరాజు నేపధ్యం సంగీతం ఓకే. నాటకం వేసినప్పుడు వచ్చిన పాట బావున్నప్పటికీ స్క్రిప్ట్ లో దానికి అంత స్కోప్ లేదు. రామ్ మిరియాల ఇచ్చిన లచ్చమమ్మ పాట ఆకట్టుకుంటుంది. వాసంత్ కెమరాపనితనం నీట్ గా వుంది. అడవిని అందంగా చూపించారు. మేర్లపాక గాంధీ డైలాగ్స్ లో మెరుపులేవు.

నక్సల్ నేపధ్యాన్ని కూడా కామెడీ విధానంలో డీల్ చేయాలనుకున్నాడు మేర్లపాక గాంధీ. దానికి అతను ఎంచుకున్న సెటప్ కుదరలేదు. తీస్తే కృష్ణ వంశీలా `సింధూరం’ తీసేయాలి, లేదా అనిల్ రావిపూడిలా ఎఫ్ 2 చేసేయాలి. అంతేకానీ సిద్ధాంతాలని సిల్లీగా డీల్ చేద్దామని ప్రయత్నిస్తే మాత్రం డిస్ లైకులే పడతాయి.

ఫినిషింగ్ ట‌చ్‌: లైకు కాదు.. మేకు

తెలుగు360 రేటింగ్: 1.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close