త్రివిక్ర‌మ్ సినిమాకీ బ‌డ్జెట్ కోత‌..?

కాట‌మ‌రాయుడు సినిమాని చుట్టేశార‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ఇంతా పోగేస్తే ఈ సినిమా మేకింగ్‌కి రూ.30 కోట్లు కూడా ఖ‌ర్చు కాలేద‌ట‌. ఈ సినిమాని వీలైనంత త‌క్కువ‌లో తీయాలి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్టిమేట్టం జారీ చేయ‌డం,దాన్ని శ‌ర‌త్ మ‌రార్ తుచ త‌ప్ప‌కుండా ఫాలో అయిపోవ‌డంతో కాట‌మ‌రాయుడ్ని చీప్‌గా చుట్టేశారు. ఇప్పుడు స‌రిగ్గా ఇదే ఫార్మెట్ త్రివిక్ర‌మ్ సినిమా విష‌యంలోనూ ఫాలో అవుతున్నార‌ని తెలుస్తోంది. కాట‌మ‌రాయుడు అంత కాక‌పోయినా.. ఈ సినిమానీ వీలైనంత త‌క్కువ‌లో తీయాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్లాన్‌. పైగా క‌థానుసారం పెద్ద పెద్ద సెట్టింగులు అవ‌స‌రం లేద‌ని తెలుస్తోంది. సినిమా అంతా ఒక‌ట్రెండు సింపుల్ లొకేష‌న్ల‌లోనే పూర్త‌య్యే ఛాన్సుంద‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్ మేకింగ్ స్టైల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. విజ‌వ‌ల్ గా ఆయ‌న సినిమాలు గ్రాండ్‌గా ఉంటాయి. చిన్న చిన్న పాత్ర‌ల‌కు సైతం పెద్ద పెద్ద న‌టుల్ని తీసుకొంటారు. ఎక్క‌వ రోజులు షూటింగ్ జ‌రుపుతారు.

అయితే.. ఈ సినిమాని 4 నెల‌ల్లో పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. సెస్టెంబ‌రులో ప‌వ‌న్ సినిమాని విడుద‌ల చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తక్కువ‌లో తీసినా.. సినిమా రిచ్‌గా ఉండాల‌ని త్రివిక్ర‌మ్ ఆశ ప‌డుతున్నాడ‌ని, క్వాలిటీ విష‌యంలో ఆయ‌న కాంప్ర‌మైజ్ అయ్యే క‌రం కాద‌ని.. ప‌వ‌న్ కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ కంట్రోల్ ఎప్పుడూ మంచిదే. నీళ్ల‌లా డ‌బ్బుల్ని వెద‌జ‌ల్ల‌కుండా క‌థ‌కు త‌గ్గ‌ట్టు ఖర్చు చేయాలి. అయితే అవ‌స‌రం అనుకొన్న చోట ఓ రూపాయి ఎక్కువ ఖ‌ర్చు చేసినా త‌ప్పులేదు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమా విష‌యంలోనూ ఈ లెక్క‌ల్ని ఫాలో అవుతున్నార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కామ్రేడ్ భార‌త‌క్క‌… ఆగ‌మ‌నం

నీదీ నాదీ ఒకే క‌థ‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌. ఆ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. క‌మ‌ర్షియ‌ల్ గానూ ఓకే. అందుకే... `విరాట‌ప‌ర్వం` ఛాన్సొచ్చింది. న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది....

స్టైరిన్ లీకవ్వగానే వాళ్లు పారిపోయారట..!

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్ లీకేజీ జరిగింది. ఆ ఘటన కారణంగా అప్పటికప్పుడు పన్నెండు మంది... ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయారు. కానీ.. ఎల్జీ పాలిమర్స్‌లో పని చేసే వారికి చిన్న...

మీడియా వాచ్ : సాక్షి ఆఫీసులో కరోనా కలకలం..!

తెలుగు మీడియాలోనూ కరోనా కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయం కేంద్రంగా విధులు నిర్వహించే ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. సాక్షి కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేశారు....

కార్తికేయ 2 నుంచి అనుప‌మ ఔట్‌?

చందూ మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. నిఖిల్ కెరీర్‌కి బాస‌ట‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబోలోనే కార్తికేయ 2 రూపుదిద్దుకుంటోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని...

HOT NEWS

[X] Close
[X] Close