లిక్కర్ స్కాం నిందితుల చెయిన్ ను ఎక్కడో చోట తెంపేసి.. సూత్రధారుల గురించి బయటకు రాకుండా చేయాలని కొంత మంది గట్టి ప్రణాళికలు వేసుకుంటున్నారు. వాటిని పసిగట్టినంత వరకూ సీఐడీ అధికారులుభగ్నంచేస్తున్నారు. తాజాగా విదేశాలకు పారిపోవాలనిప్రయతనించిన రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్ ను సీఐడీ అధికారులు చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందుగానే ఆయనపై లుకౌట్ నోటీసులు ఇవ్వడంతో దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి దిలీప్ దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
మొత్తం లిక్కర్ స్కాం నెట్వర్క్ ను.. సీఐడీ అధికారులు ఎప్పుడో బయటకు లాగారు. అందరిపై సాక్ష్యాలు కూడా సేకరించారు. ఇప్పుడు ప్రణాళికాబద్దంగా అరెస్టులు చేస్తూ స్కాం డాట్స్ ను కలుపుతూ వస్తున్నారు. అన్నీకలిపిన వెంటనే కింగ్ పిన్ ఎవరో సాక్ష్యాలతో సహా వెలుగులోకి వస్తుంది. సీఐడీ అధికారుల ప్లాన్లను ముందుగానే కనిపెడుతున్న నిందితులు.. ఎక్కడో ఓ చోట ఆ డాట్స్ మిస్ చేసే కీలక వ్యక్తుల్ని విదేశాలకు తరలిస్తే.. అక్కడితో దర్యాప్తు ఆగిపోయేలా చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ సీఐడీ అధికారులు ఎత్తులకుపై ఎత్తు వేస్తున్నారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు బయట ఉంటే.. తనకు ఉన్న సోర్స్ తో సిట్ అధికారులు ఏం చేస్తున్నారన్న దానిపై సమాచారం తీసుకుని.. నిందితులకు సాయం చేస్తూ వచ్చారు. రాజ్ కసిరెడ్డి చాలా రోజుల పాటు పరారీలో ఉండటానికి ఆయనే కారణం అని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయడంతో.. జైల్లో ఉన్నారు. ఇప్పుడు వారి నెట్ వర్క్‌కు అందే సాయం కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు.