జయప్రకాష్ నారాయణ సంచలన నిర్ణయం

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఇవ్వాళ్ళ ఒక సంచలన ప్రకటన చేసారు. ఇకపై తమ పార్టీ ఏ ఎన్నికలలోనూ పోటీ చేయబోదని ప్రకటించారు. కనుక ఇకపై లోక్ సత్తా పార్టీని రాజకీయ పార్టీగా చూడవద్దని ఆయన ప్రజలని, మీడియాని, రాజకీయ పార్టీలని కోరారు. ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటం కోసమే తమ పార్టీ ఆవిర్భవించినప్పటికీ, అధికారంలోకి రాగలిగితే ఇంకా సమర్ధంగా ప్రజా సేవ చేయవచ్చనే ఉద్దేశ్యంతోనే ఇంత కాలం ఎన్నికలలో పోటీ చేశామని, కానీ దాని వలన తమ పార్టీ ధ్యేయం నేరవేరడం లేదనే సంగతి గుర్తించి, ఇకపై ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు జయప్రకాష్ నారాయణ చెప్పారు.

ఆయన చెప్పిన మాటలలో వాస్తవమే కానీ ఎన్నికలకు దూరంగా ఉండేందుకు ఆయన చెపుతున్న కారణం మాత్రం పూర్తిగా నిజం కాదనే చెప్పవచ్చును. గత కొన్ని దశాబ్దాలుగా కార్పోరేట్ సంస్థల అధినేతలు, బడా వ్యాపారస్తులు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడంతో ఎన్నికలు చాలా ఖరీదయిన వ్యవహారంగా మారిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అభ్యర్ధులు కోట్లు ఖర్చుపెట్టవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక బాగా ఆర్దికబలం ఉన్న తెదేపా, భాజపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల వంటి పెద్ద పార్టీలు మాత్రమే అంత భారీ ఖర్చును తట్టుకోగలుగుతున్నాయి. లోక్ సత్తావంటి చిన్న చిన్న పార్టీలు వాటి ముందు నిలబడలేవు.

లోక్ సత్తా నీతి, నిజాయితీకి కట్టుబడి ఉంటుందని చాలా మంది ప్రజలు బలంగా నమ్ముతారు కానీ ఎన్నికలు వచ్చేసరికి, ఆ నాలుగు పెద్ద పార్టీలలో దేనికో దానికి ఓట్లు వేస్తుంటారు తప్ప లోక్ సత్తాకి వేయాలనుకోరు. 2014 ఎన్నికలలో మల్కజ్ గిరి నుంచి లోక్ సభకు పోటీ చేసినప్పుడే ప్రజల ఈ తీరును జయప్రకాశ్ నారాయణ బాగా గుర్తించారు. కానీ ఇటువంటి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకోవాలంటే, పార్టీలో అంతర్గతంగా చాలా చర్చ జరుపవలసి ఉంటుంది కనుక, ఈ నిర్ణయం ప్రకటించడానికి ఇంత సమయం తీసుకొని ఉండవచ్చును. ప్రజలను మార్చే అవకాశం లేదని గ్రహించినందునే, లోక్ సత్తా పార్టీయే తన వైఖరిని మార్చుకొందని చెప్పకతప్పదు. ఏమయినప్పటికీ ఒక మంచి రాజకీయపార్టీని ప్రజలే కోల్పోయారని చెప్పకతప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close