బాలకృష్ణ, నారా లోకేష్‌లపై జగన్ తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ అంశంపై తెలుగుదేశం ప్రభుత్వం చర్చకు ససేమిరా అనటమేమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ కేసులను సాధారణ వడ్డీ వ్యాపారం కేసులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సెక్స్ రాకెట్ విజయవాడలో జరిగితే రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఎందుకని అడిగారు. వడ్డీవ్యాపారానికి లింక్ చేసి కేసులను నీరు గార్చారని ఆరోపించారు. సెక్స్ రాకెట్‌లో వడ్డీలు కడతారా, వ్యభిచారం చేస్తారా అని అడిగారని చెప్పారు. కాల్‌మనీ వ్యాపారులు వందలమంది ఆడవాళ్ళ మాన, ప్రాణాలతో చెలగాటమాడారని అన్నారు. వందల వీడియో టేపులు పట్టుబడ్డాయని చెప్పారు.

రోజా సస్పెన్షన్‌పై మాట్లాడుతూ, రోజమ్మను కావాలని ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. కామ సీఎమ్ అని అందరమూ అన్నామని, కావాలని రోజమ్మను మాత్రమే సస్పెండ్ చేశారని అన్నారు. ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేదని చెప్పారు. నిన్న కూడా సభలో రోజమ్మ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. చంద్రబాబు రాక్షసపాలను ఆయనకు తెలియచెప్పటంకోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి హద్దులు దాటిపోయిందని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలనుంచి ఇసుక దందాలో నారా లోకేష్‌కు రోజుకు కోటి రూపాయలు వెళుతోందని అన్నారు. ముఖ్యమంత్రి తన బంధువులకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బాలకృష్ణ వియ్యంకుడికి కృష్ణానది ఒడ్డున జగ్గయ్యపేట వద్ద 498 ఎకరాలను ఎకరం లక్ష రూపాయల చొప్పున కేటాయించారని, దాని విలువ ప్రస్తుతం రు.50 లక్షలని చెప్పారు. అదేమని అడిగితే వారు 2013లోనే దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆ భూమి మొత్తం విలువ రు. 5 కోట్లకు ఇచ్చేశారని మండిపడ్డారు. చిత్తూరుజిల్లా కరకంబాడిలో గల్లా అరుణ కుటుంబానికి 21.69 ఎకరాల భూమిని ఎకరం రు.22 లక్షల చొప్పున కేటాయించారని, ఆ భూమి విలువ ఎకరా రు.2 కోట్ల నుంచి రు.2.5 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం మధురవాడలో 50 ఎకరాల భూమికి సంబంధించి ఎకరం విలువ రు.15 కోట్లు బహిరంగ మార్కెట్‌లో ఉంటే దాని మార్కెట్ విలువను రు.7.26 కోట్లుగా నిర్ధారించి, ఏపీఐఐసీకి రు.50 లక్షల చొప్పున కేటాయించారని, ఏపీఐఐసీ ఆ భూమిని చంద్రబాబు బినామీలకు రు.50 లక్షలకే కేటాయించారని ఆరోపించారు. శ్రీకాకుళంలో టీడీపీ పార్టీ ఆఫీసుకోసం చంద్రబాబు తనంతట తానే భూమిని కేటాయించుకున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిందని మొదట చంద్రబాబు చెప్పారని, చివరికి చూస్తే వచ్చేది సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలని తేలిందని అన్నారు. ఆ కంపెనీలకు రాజధానికి భూమిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇవ్వటమంటే – నామినేషన్ పద్ధతిలో దొంగదారిలో తనకు కావల్సినవారికి భూములు ఇవ్వటమేనని ఆరోపించారు. 99 ఏళ్ళకు లీజుకు ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. ఇసుక ధరను క్యూబిక్ మీటర్ రు.40 నుంచి రు.700కు పెంచారని ఆ లెక్కన రు.1,500 కోట్ల ఆదాయం రావాలని, కానీ రు.810 కోట్లే చూపుతున్నారని అన్నారు. జెన్‌కో ధర్మల్ ప్లాంట్లలో కుంభకోణం జరుగుతోందని జగన్ ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close