నారా లోకేష్ ఏపీకి పెట్టుబడులు పెట్టే విషయంలో పారిశ్రామికవేత్తల్ని ఎలా అయితే ఆకట్టుకోవాలో అలాగే ప్రయత్నిస్తున్నారు. నిన్నటికి నిన్న ఏరో స్సేస్ ఇండస్ట్రీ ప్రముఖులకు ఆయన సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ కోసం భూసేకరణను నిలిపివేయడంతో .. తమ వద్ద కావాల్సినన్ని భూములు ఉన్నాయని అది కూడా.. బెంగళూరుకు దగ్గరగానేనని ఆయన ట్విట్టర్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది.
తాజాగా ఆయన ఆనంద్ మహింద్రాకు ఇలాంటి సందేశమే ఇచ్చారు. మహింద్రా ట్రక్స్, బస్సుల ఇండస్ట్రీ .. ఓ కొత్త ప్రకటన తయారు చేసింది. తెలుగులో కూడా ఆ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనను ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. నారా లోకేష్ వెంటనే అందుకున్నారు. తెలుగులో ప్రకటన చేసినందుకు ధన్యవాదాలని.. ఏపీలో కూడా మహింద్రా పరిశ్రమకు మంచి మార్కెట్ ఉందని.. ఇక్కడే ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి మహింద్రా కూడా స్పందించారు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులపై కలసి పని చేస్తున్నామని.. మన భాగస్వామ్యం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
నారా లోకేష్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఏపీ ప్రయోజనాలకు ఉపయోగపడతారు అనుకుంటే చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టరు. వెంటనే టచ్ లోకి వెళ్లిపోయారు. అలాగే సాయం అడిగే వారికి చురుకుగా స్పందిస్తూంటారు. అందరికీ అందుబాటులో ఉన్న భావన కల్పిస్తూంటారు.