ఏదో ఒకటి బురద చల్లేద్దామనుకుంటే రివర్స్ లో వచ్చే కౌంటర్లు తట్టుకోవడానికి సిగ్గు,శరం వదిలేసి తుడుచుకునేంత తెంపరితనం ఉండాలి. వైసీపీ సోషల్ మీడియాకు ఇది టన్నుల కొద్దీ ఉంటుంది. అందుకే ఎన్ని సార్లు ఫేక్ ప్రచారాలపై వాతలు పెట్టినా వారి తీరు మాత్రం మారదు. తాజాగా లోకేష్ నేరుగా గట్టి స్ట్రోక్ ఇచ్చారు. దానికి వారి వద్ద సమాధానం లేదు.
మహిళలకు పంచే కుట్టు మిషన్లకు టీడీపీ రంగులు ఉన్నాయని ఓ ఫోటో పట్టుకుని.. ప్రభుత్వం డబ్బులు చేసుకునేది టీడీపీ ప్రచారం అని ఓ వైసీపీ హ్యాండిల్ పోస్టు చేసింది. దానికి జగన్ రెడ్డి చేసుకున్న రంగుల ఉద్యమంతో పరోక్షంగా ముడి పెట్టుకుంది. ఈ పోస్టు లోకేష్ కంట పడింది. ఆయన సూటిగా సుత్తిలేకుండా .. వైసీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవి తన సొంత డబ్బుతో ఇచ్చిన కుట్టు మిషన్లు అని… ఇచ్చింది కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పడమే కాదు.. ప్రభుత్వ ధనంతో పార్టీ రంగులు వేసుకోడానికి నేను మీ నాయకుడి మాదిరి కక్కుర్తి మనిషిని కాదని నేరుగా గుచ్చేశారు.
తొలి సారి ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ మంగళగిరిలోనే పని చేస్తున్నారు. సొంత డబ్బులు పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయనకు దాదాపుగా 90వేల మెజార్టీ వచ్చింది. అప్పటి ఫోటోలను పట్టుకుని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏదో చేద్దామని ప్రయత్నించి అభాసుపాలవుతోంది. నిజానికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా రాజకీయ పార్టీల రంగులు లేకుండా.. ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఆ విషయంలో ప్రజలకు తేడా కనిపిస్తోంది. కానీ పేటీఎం కూలీలకు మాత్రం అర్థం కావడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.