కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే .. నారా లోకేష్ తో వాదనలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కోరికను తీర్చేందుకు నారా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారు.కానీ నేరుగా ఆయనతో ఎంగేజ్ కాకుండా.. పరోక్షంగా స్పందిస్తున్నారు. ఏపీకి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ పై ప్రియాంక్ ఖర్గే భిన్నంగా స్పందించారు. పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ఏపీకి పెట్టుబడి రప్పించుకున్నారని.. కర్ణాటకకు అలాంటి అవసరం లేదన్నారు.
ప్రియాంక్ ఖర్గే రిప్లైపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కన్నడిగులే మండిపడుతున్నారు. లోకేష్ స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నారని..కానీ ప్రియాంక్ ఖర్గే ప్లస్ టు ఫెయిల్ అని ఆయన ఐటీ మంత్రిగా పని చేస్తూ.. ఇలా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ప్రియాంక్ ఖర్గే మాటలు నారా లోకేష్ దృష్టికి రావడంతో.. కొంత మంది పొరుగువారికి ఇబ్బందికరంగా ఉందని సెటైర్లు వేశారు. ఖర్గే .. బెంగళూరును గొప్పగా చెప్పుకునేందుకు ఏపీని గతంలో కించ పరిచారు. దాన్ని గుర్తు చేసేలా సెటైర్లు వేశారు.
ఖర్గే వ్యవహారమే కాదు.. బెంగళూరు పెట్టుబడుల విషయంలో వెనుకబడిపోతోందని.. మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం చేయడం పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇలాంటి ఫీడ్ బ్యాక్ ను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవడం లేదు. మంత్రులు ఇలాంటి ఫీడ్ బ్యాక్ చెప్పిన వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. పారిశ్రామికవేత్తలైనా వదిలి పెట్టడం లేదు. కర్ణాటక మంత్రుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.