జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ వార్నింగ్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేయడాన్ని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అమరావతిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ కి రైతులే స్వచ్చందంగా ముందుకు వచ్చి 33000 ఎకరాలను ఇవ్వడం తెలియదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిల్లీలో పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం వలన రాష్ట్రానికి తీరని నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. గత ఎన్నికలలో తమ పార్టీ చేతిలో వైకాపా ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, ఆయన తీరు ఇలాగే కొనసాగినట్లయితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైకాపా కనబడకుండా మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పుట్టి పెరిగారు కనుకనే పదేపదే అవినీతి మంత్రం వల్లెవేస్తున్నట్లున్నారని లోకేష్ ఎద్దేవా చేసారు.

వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ఎత్తుకుపోవడం మొదలుపెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి, రాజధాని ప్రాంతంలో తెదేపా మంత్రులు, నేతల బినామీ భూముల కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టి, ఫిరాయింపులను తాత్కాలికంగా నెమ్మదింపజేయగలిగారు. ఆ వ్యవహారం బయటపెట్టినప్పుడు తెదేపా జవాబు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడింది. తనపై జగన్ నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు ఆయనని కోర్టుకి ఈడ్చుతానని మంత్రి పి.నారాయణ హెచ్చరించారు కానీ అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో జగన్ కూడా ఎందుకో కొంచెం వెనకడుగువేసినట్లు కనబడుతోంది. అందుకే వైకాపా ఎమ్మెల్యేల వలసలు మళ్ళీ మొదలయ్యాయి. వాటి జోరు పెరగడంతో, జగన్ మళ్ళీ దానికి అడ్డుకట్ట వేయడానికి “ఎంపరర్ ఆఫ్ కరప్షన్” అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి ఈసారి డిల్లీ నుంచి ప్రయోగిస్తున్నారు. లోకేష్ తో సహా తెదేపా నేతలు అందరూ దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారయినా ఆ బ్రహ్మాస్త్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడాలి. పనిచేస్తే తెదేపాకి పనిచేయకపోతే వైకాపా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close