రాజేంద్రప్రసాద్ ఎక్కించిన మునగచెట్టు మీద తెలుగుదేశం!

పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకోకూడదని తెలుగుదేశం, బిజెపి పార్టీల సమన్వయ సమావేశం అవగాహనకు వచ్చి వారంతిరగకముందే ”కాబోయే ప్రధాని చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ బాబు” అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం రెండు పార్టీల్లోనూ అంతర్గత చర్చకు తెరలేపింది.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల్లో అధినాయకున్ని పొగడ్తలతో ముంచేసే”రాజుని మించిన రాజభక్తే” కనిపిస్తోంది. అయితే ఆయన పార్టీ అధికార ప్రతినిధి అయివుండటంతో పార్టీ హై కమాండ్ ఆమోదంలేకుండా చంద్రబాబుని భవిష్యత్తు దేశ ప్రధాని అనలేరు అని బిజెపిలో ఒక వర్గం నమ్ముతోంది. వారిలో పలువురు ఈ వ్యాఖ్యల గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళారని తెలిసింది. ప్రభుత్వంలో భాగస్వాములమే అయినప్పటికీ తెలుగుదేశం తమపార్టీకి మర్యాద ఇవ్వడం లేదని ఉద్దేశ్యపూర్వకంగానే చులకనగా చూస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ వాస్తవం కూడా! జిల్లా స్ధాయిలో కూడా రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్నేహపూరితమైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు మూలం.

”వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓడిపోతేనే కదా చంద్రబాబు ప్రధాని అయ్యేది? మరి చంద్రబాబు ఎవరి కూటమిలో చేరి ప్రధాని అవుతారు? వామపక్షాల కూటమిలో చేరతారా? మూడవ కూటమికి నాయకత్వం వహిస్తారా? మరి బాబు ప్రధాని అయితే, బిజెపికి చెందిన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ఎలా అవుతారు?” అని తెలుగుదేశం నాయకుడు రాయపాటి సాంబశివరావు గతంలో వ్యాఖ్యానించడం టిడిపి ఆలోచనల్ని బయట పెడుతోందని, ఇపుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానాలు వాటిని దృవపరస్తున్నాయనీ చెబుతున్నారు.

ఇందులోకి కావాలనే వెంకయ్య నాయుడు పేరు ఈడ్చుకువచ్చి ఆయన్ని ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారి సామాజిక వర్గీయుడే అని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా బిజెపి వర్గాలు విమర్శిస్తున్నాయి. ”ఇదంతా చంద్రబాబు కి తెలిసే జరుగుతుందని చెప్పలేము…కానీ, చూసీచూడనట్టున్న వైఖరినే ఆయన కొనసాగిస్తే మాత్రం ఇదంతా ఆయనకు సమ్మతమే అనుకోవాలి. అలా అయితే రెండు పార్టీల మధ్యా కెమిస్ట్రీలు పూర్తిగా మారిపోతాయి” అని బిజెపి ముఖ్యులు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రధాని అవుతారంటే అభ్యంతరం చెప్పడానికి బిజెపికి ఏమీలేదు.అయితే తెలుగదేశం ఆలోచనలు ఇలా వున్నాయని జాతీయ స్ధాయి బిజెపి నాయకులకు తెలియపరచడానికి మాత్రం రాజేంద్రప్రసాద్ మాటలు బాగా ఉపయోగపడతాయి. ఈయన వ్యాఖ్యానాలు తెలుగుదేశం వర్గాలకు కూడా చికాకుగానే వున్నాయి. ఇలాంటి మాటల వల్ల పార్టీకి ఎంతో కొంత ఇబ్బందే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని తెలుగుదేశం సీనియర్ నాయకలు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయనాయకులకు ప్రచారం కండూతి అవసరమే. తెలుగుదేశం వాళ్ళకి అది కాస్త ఎక్కువే! ప్రతిపక్షంలో వుంటే నోటికొచ్చింది మాట్లాటే స్వేచ్చ వుంటుంది. అలా చెలరేగిపోయే రాజేంద్రప్రసాద్ ఇపుడు అధికార ప్రతినిధి కావడంతో టివిల్లో అధినాయకుడిని మునగచెట్టు ఎక్కించే పని పెట్టుకున్నట్టు వున్నారు. కొమ్మ విరక్కుండా చెట్టుదిగి రావడమే తెలుగదేశం ముందున్న మొదటి పని!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close