‘పుష్ప‌’లో ల‌వ్ స్టోరీ అలా మారింది

‘పుష్ఫ’ 2 భాగాలుగా విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే… ఈ సినిమాని రెండు భాగాలుగా చేయాల‌న్న నిర్ణ‌యం… కాస్త లేట్ గా తీసుకున్నారు. షూటింగ్ మొద‌లైన నెల రోజుల త‌ర‌వాత‌.. ఇంత పెద్ద క‌థ‌ని ఒకే సినిమాగా చెప్ప‌లేం అనిపించి, పార్ట్ 2 గా మ‌లిచారు. ఎప్పుడైతే రెండు భాగాలుగా తీసుకురావాల‌ని అనుకున్నారో, అప్పుడే కొన్ని కొత్త స‌న్నివేశాలు కావాల్సివ‌చ్చింది. అందులో భాగంగా పుష్ప‌లో ప్రేమ‌క‌థ‌ని జోడించారు.

నిజానికి సుకుమార్ రాసుకున్న క‌థ ప్ర‌కారం… శ్రీ‌వ‌ల్లి- పుష్ఫ‌ల‌కు ముందే పెళ్ల‌యిపోతుంది. ఈ పెళ్లి ఇటు పుష్ప‌కీ, అటు శ్రీ‌వ‌ల్లికీ ఇష్టం ఉండదు. ఇష్టం లేకుండా.. వాళ్లు కాపురం ఎలా చేశారో చూపిస్తూ… వాళ్ల‌మ‌ధ్య ఓ ల‌వ్ స్టోరీ న‌డిపాడ‌ట సుకుమార్‌. పార్ట్ 2 అనే ఆలోచ‌న వ‌చ్చింది కాబ‌ట్టి, కొత్త స‌న్నివేశాలు అవ‌స‌రం అయ్యాయి కాబ‌ట్టి.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని మార్చుకుని పుష్ప శ్రీ‌వ‌ల్లిల మ‌ధ్య ప్రేమ‌క‌థ సృష్టించాడు సుకుమార్‌. ల‌వ్‌స్టోరీలు న‌డ‌ప‌డంలో సుకుమార్ దిట్ట‌. ఈసారి కూడా అలాంటి వెరైటీ కాన్సెప్టుతోనే ఈ ప్రేమ‌క‌థ న‌డిపాడ‌ట‌. అందులోనే కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా పండింద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close